బ్రేకింగ్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‎కు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‎కు హైకోర్టులో చుక్కెదురైంది.సోమేశ్ కుమార్ క్యాడర్ ను న్యాయస్థానం రద్దు చేసింది.

 Breaking :telangana Cs Somesh Kumar Will Be Dropped In The High Court-TeluguStop.com

అదేవిధంగా ఏపీకి వెళ్లిపోవాలంటూ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో అప్పీల్ కు సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది సమయం కోరగా .సమయం ఇచ్చేది లేదని కోర్టు స్పష్టం చేసింది.కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ఉత్తర్వులను కొట్టివేసింది.

డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఈ ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపివేసింది.

గతంలో సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు క్యాట్ ఉత్తర్వులు కొట్టి వేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించింది.అయితే సీఎస్ సోమేశ్ కుమార్ కంటే సమర్థులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఏపీ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్ పై రప్పించుకోవాలని కేంద్రం సూచించింది.

రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఏపీకి కేటాయించడంపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube