ఈ మధ్యకాలంలో భారతదేశం నుంచి చాలామంది ప్రజలు వేరే దేశాలకు వెళ్లి స్థిరపడాలని ఆలోచనలు చేస్తున్నారు.వారిలో చాలా రోజుల నుంచి గోవా ప్రజలు ఎక్కువగా తమ భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఆసక్తి చెబుతున్నారు ఎందుకంటే వారి జీవన పరిస్థితులు అలా ఉన్నాయి మరి.
అక్కడి ప్రజలు ఎక్కువగా పోర్చుగల్ పౌరసత్వాన్ని పొందడానికి ఆసక్తిగా ఉన్నారు.కానీ ప్రస్తుత పరిస్థితులలో భారతీయులు అధిక సంఖ్యలో తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారన్న ఆందోళన నేపథ్యంలో గోవాలో ఒక శుభవార్త వెలుగులోకి వచ్చింది.
గోవాలో తాజాగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలిసింది.2022లో 1265 మంది మాత్రమే వదులుకున్నట్లు అక్కడి పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015 లో 3873 మంది తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 2016లో 4139 మంది, 2017లో 3603 మంది విదేశీ పౌరసత్వం కోసం తమ భారతీయ పాస్ పోర్ట్ ను గోవా కార్యాలయంలో అప్పగించారని తెలుస్తోంది.

అంతేకాకుండా 2019 నుంచి ఈ ధోరణి తగ్గుతూ వస్తుంది.2019లో 2927 మంది మాత్రమే భారత పౌరసత్వాన్ని వదులుకోగా కరోనా సంక్షోభం కారణంగా 2020లో 930 మంది, 2021లో 2835 మంది తమ పాస్ పోర్ట్ ను సరెండర్ చేసినట్లు సమాచారం.అయితే ఈ మార్పుకు గల కారణాలపై ఇంకా స్పష్టత కూడా రాలేదు.
ఇంకా చెప్పాలంటే గోవాలో కొన్ని ప్రాంతంలోని వారికి పోర్చుగల్ పౌరసత్వం పైన ఆసక్తి తగ్గలేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా ఒకప్పుడు పోర్చుగల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో వారు వారి వారసులకు పోర్చుగల్ పౌరసత్వం సులువుగా లభిస్తుందడంతో గోవాలోని కొందరు పోర్చుగల్ పౌరసత్వం పొందడానికి ఆసక్తి చెబుతున్నట్లు సమాచారం.కానీ తాజాగా ఈ పరిస్థితి దాదాపు మారిపోయినట్లే కనిపిస్తోంది.







