కోలీవుడ్ హీరోలు కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఎందుకంటే చాలా మంది హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు.
మరి అలా డబ్బింగ్ సినిమాలతో అలరించే స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో అజిత్ సినిమా వస్తుంది అంటే అక్కడ మాములు అంచనాలు ఉండవు.
మరి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ సినిమా ”తునివు” మీద కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.దక్షిణాదిలో అతి పెద్ద సీజన్ ఏది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.మరి ఈ సీజన్ లో ఈసారి నలుగురు స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.2023 సంక్రాంతికి కోలీవుడ్ నుండి కూడా రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అందులో ఒకటి విజయ్ దళపతి నటించిన వారసుడు కాగా.
మరొకటి అజిత్ కుమార్ నటించిన తునివు.

అజిత్ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కాబోతుంది.అయితే విజయ్ సినిమా వారసుడు రెండు రోజుల పాటు వాయిదా పడి జనవరి 14న రిలీజ్ కాబోతుంది.దీంతో అజిత్ సినిమా తెలుగులో భారీ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
తెగింపు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అజిత్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ దక్కినట్టు టాక్.దీంతో ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పాలి.

జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పతాకంపై బోణీ కపూర్ నిర్మించారు.మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది.అలాగే సముద్రఖని కూడా కీలక పాత్రలో నటించాడు.







