పొంగులేటి.. మరో కోమటి రెడ్డేనా..?

ఖమ్మం జిల్లాలో, మంచి పలుకుబడి తో పాటు.పరపతి ఉన్న నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

 Ponguleti Srinivasa Reddy Potical Strategy In Telangana , Ponguleti Srinivasa R-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని.అంచలంచెలుగా ఎదిగారు.

అన్న నందమూరి తారక రామారావు అధికారం లో ఉన్నప్పుడు పెరువంచ మేజర్ పై క్రాస్ వాల్ నిర్మించి.సుమారు 470 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేశాడు.

అప్పటి నుంచి కాంట్రాక్టర్ గా ఎదుగుతూ.కాంగ్రెస్ పార్టీలో పదవులు తీసుకున్నారు.

ఇక వైఎస్ మరణం తర్వాత అయన.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్సీపీ లో చేరారు.ఆ పార్టీ నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ వైసీపీ పార్టీలో నుంచి ఖమ్మం ఎంపీ గా గెలిచారు.తర్వాత కొన్నాళ్లకు ఇప్పటి బీ అర్ ఎస్ అప్పటి టీఆరెఎస్ లో చేరిపోయారు.ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా.టీఆరెఎస్ పార్టీ నేతలకు మద్దతు ఇచ్చాడు.అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు పరోక్షంగా దూరం అయ్యాడు.ఇక ఈ సారి అయినా సీటు వస్తుంది అనుకుంటే.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దయ వల్ల అది కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్టు గుర్తించాడు.

దాంతో ఇక లాభం లేదని.బీజేపీ నేతలతో మంతనాలు ప్రారంభించాడు.

Telugu Amitha Sha, Khammam, Konatireddy, Nalgonda, Ts-Politics

తెలంగాణ లో బీజేపీ కి చాలా జిల్లాల్లో కేడర్ లేదు.దాంతో కేడర్ ఉన్న నేతల్ని చూసి కండువా కప్పెస్తున్నారు.ఇలాగే మునుగోడు మాజీ ఎమ్మేల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డీ కి గేలం వేసి.పార్టీ లో చేర్చుకున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డీ బ్రదర్స్ కి గట్టి కేడర్ ఉంది.దాన్నంతటిని ఒక్క జుంపింగ్ తో బీజేపీ కాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది.

అయితే ఇక్కడే బీజేపీ లెక్క తప్పింది. సీఎం కెసిఆర్ మునుగోడు ఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రచారం మొదలు పెట్టారు.

అంతే కాకుండా ఎమ్మెల్యే లను, మంత్రులను, ఎమ్మెల్సీ లను, ఎంపిలను గ్రామ గ్రామానికి ఇంచార్జీ లుగా పెట్టీ సర్వశక్తులు ఒడ్డి కుసుకుంట్లను గెలిపించి.రాజగోపాల్ రెడ్డి నీ ఇంటికి పంపాడు.

దాంతో కోమటి రెడ్డీ బ్రదర్స్ చరిష్మా నల్గొండ లో తగ్గిపోయింది అనే సినారియో జనాల్లోకి తీసుకు వెళ్ళాడు .

Telugu Amitha Sha, Khammam, Konatireddy, Nalgonda, Ts-Politics

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి చరిష్మా ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ.ఇప్పటి దాకా ఖమ్మం జిల్లాలో బీజేపీ కి కేడర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.దాంతో పొంగులేటి పార్టీ లోకి తీసుకుంటే అయన చరిష్మా తో అక్కడ బలపడోచ్చు అని చూస్తున్నారు.

అయితే కోమటి రెడ్డీ రాజగోపాల్ రెడ్డి పరిస్థితే పొంగులేటి కి వస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే కోమటి రెడ్డీ రాజగోపాల్ రెడ్డి మాదిరి.పొంగులేటి కూడా కాంట్రాక్టర్ కావడం తో కాషాయ పార్టీ చాలా ఈసీ గా పార్టీ లోకి తీసుకుంటుంది.మరి పొంగులేటి నిజంగా బీజేపీ లో నిలబడతారా.? లేక సీఎం కెసిఆర్ ను బెదిరించ డానికే ఇలా చేస్తున్నారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube