సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలలో ఒకటైన వీరసింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్ కు ఏకంగా 4.2 మిలియన్ వ్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.వ్యూస్ విషయంలో యూట్యూబ్ లో బాలయ్య హవా కొనసాగుతోంది.
ఈ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులే మళ్లీ మళ్లీ చూస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
అయితే వీరసింహారెడ్డి ట్రైలర్ లో జగన్ ను టార్గెట్ చేసేలా బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ ఉన్నాయి.
ట్రైలర్ లోనే ఈ రేంజ్ డైలాగ్స్ ఉన్నాయంటే సినిమాలో మరిన్ని డైలాగ్స్ ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.సాయిమాధవ్ బుర్రా ఈ డైలాగ్స్ ను రాయగా బాలయ్య నోటి నుంచి ఈ డైలాగ్ లను విన్న అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
అయితే ఈ డైలాగ్స్ వల్ల వీరసింహారెడ్డి మూవీకి రెండు విధాలుగా నష్టమని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వీరసింహారెడ్డి మూవీ టికెట్ రేట్లు పెరిగేలా ఏపీ ప్రభుత్వాన్ని అనుమతులు కోరారు.తమ ప్రభుత్వంపై సినిమాలో పంచ్ డైలాగ్స్ ఉండటంతో వైసీపీ టికెట్ రేట్ల పెంపుకు అంగీకరించే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అదే సమయంలో జగన్ సర్కార్ వీరసింహారెడ్డికి అదనపు షోలకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం లేదు.
ఈ విధంగా చేయడం వల్ల వీరసింహారెడ్డికి ఆర్థికంగా నష్టం కలగనుంది.అయితే సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గోపీచంద్ మలినేని బాలయ్య వీరాభిమాని కాగా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు గోపీచంద్ నిజమైన అభిమాని అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య ఖాతాలో వీరసింహారెడ్డితో మరో సక్సెస్ చేరినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.