తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్లాసికల్ సినిమాలు తీయడంలో అందవేసిన చేయి ఉంది దర్శకుడు విశ్వనాథ్ కి.ఆయన తీసిన సాగర సంగమం స్వాతిముత్యం సినిమాలు తెలుగు తెరపైనే కాదు ఇండియన్ తెరపై కూడా ఎవర్గ్రీన్ క్లాసికల్స్.
ఇక స్వాతిముత్యం సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మధ్యకాలంలో అది ఆస్కారం బరిలో కూడా నిలిచింది అంటే అది ఎంత పెద్ద విజయం సాధించిందో ఊహించొచ్చు.ఇక ఈ చిత్రంలో నటించిన కమల్ హాసన్, రాధిక రాధిక కూడా తమ అద్భుతమైన నటనతో సినిమాకి ఒక అసెట్ గా నిలిచారు.
ఈ చిత్రంలో కమల్ హాసన్ ఒక మంద బుద్ధి కలిగిన పాత్రలో నటించడం, నటించి మెప్పించడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి.
కమల్ హాసన్ లోకనాయకుడిగా ఎదగిన క్రమంలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు అతని లైబ్రరీలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన సినిమాలలో స్వాతిముత్యం కూడా ఒకటి.
ఇక రాధిక కూడా ఇదొక మంచి సినిమాగా నిలిచిపోయింది లోతైన భావాలు పలికించడంలో రాధికకు మంచి అనుభవం ఉంది అంతేకాదు ఆమె అద్భుతంగా నటించగలదు.ఈ సినిమా అప్పట్లో క్లాసికల్ సినిమాగానే కాకుండా కమర్షియల్ గా కూడా ఘన విజయం సాధించింది.
ఇక కమల్ హాసన్ ఎంతో చక్కగా నటించాడు అతడికి పోటీగా రాధిక కూడా అంతే చక్కగా నటించింది అందుకే సినిమా అంత పెద్ద విజయం సాధించింది.

అయితే ఈ సినిమా సమయంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగిందట. స్వాతిముత్యం సినిమాలో మనసు పలికే మౌన గీతం అనే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది ఇది కమలహాసన్ రాధికల మధ్య ప్రేమ చిగురించడం కోసం దర్శకుడు సృష్టించాడు.అయితే ఒకరితో ఒకరు రొమాంటిక్ గా ఉండాల్సిన ఈ సమయంలో ఇద్దరు ఒకరిలో ఒకరు ఇన్వాల్వ్ కాలేకపోయారు.
రెండు టేక్స్ చూసిన తర్వాత కమల్ హాసన్ ఎందుకు రాధికతో సరిగ్గా రొమాంటిక్ గా నటించలేక పోతున్నాడు అని అర్థం చేసుకున్న విశ్వనాథ్ ఒక ప్లాన్ వేశాడట.రాధిక పై ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసి షార్ట్ కి రెడీ అవ్వమన్నాడట విశ్వనాథ్.
దాంతో ఆమె ఒంటికి స్ప్రే చేసుకుని వచ్చి తనను అట్రాక్ట్ చేయడానికి అలా చేసింది అనుకొని కమల్ అపార్థం చేసుకున్నాడట.ఈ విషయాన్ని స్వయంగా రాజకీయ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆ తర్వాత రాధిక కు స్ప్రే చేసింది విశ్వనాథ్ అని తెలుసుకొని కమల్ ఆశ్చర్యపోయాడట.