జబర్దస్త్ లో కమెడియన్ గా అందరికీ పరిచయమై తన కామెడీ టైమింగ్ తో ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోవడమే కాకుండా యాంకర్ గా కూడా బుల్లితెరపై స్థిరపడ్డారు.ఇలా యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి సుధీర్ వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇలా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు ఆశించిన స్థాయిలో ఫలితం అందలేదు.తాజాగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్లు సునామీ కూడా సృష్టిస్తుంది.
ఇలా సుధీర్ పడిన కష్టానికి సరైన ఫలితం లభించడంతో సుధీర్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా గురించి స్పందించి సుధీర్ పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాతో సుధీర్ మాస్ హీరో అయ్యాడు.తను మాస్ హీరో అవుతాడని నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే చెప్పాను.ఇప్పుడు ఇది నిజమైంది.సుధీర్ విజయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ఇక్కడ కష్టపడతారో ఇండస్ట్రీలో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అందుకుంటారని సుధీర్ ఎప్పుడు ఇలాగే కష్టపడుతూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ గాలోడు సినిమా గురించి నాగబాబు ప్రశంసలు కురిపించారు.