Samantha Gym Video :అప్పుడే ఆ పనులు మొదలెట్టిన సమంత.. ఆరోగ్యం బాలేదన్నావ్.. అప్పుడే అవసరమా అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Samantha Works Out In Gym With Cannula In One Arm,samantha,gym Workouts,yashoda,-TeluguStop.com

గత కొద్ది రోజులుగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంది.ఈ క్రమంలోనే ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సమంత ఆ విషయం చెప్పడంతో అభిమానులు షాక్ అవ్వడంతో పాటు సమంత త్వరగా కోలుకోవాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.సెలబ్రెటీలు సైతం సమంత గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే సమంత తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.తన ఫిట్నెస్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది సమంత.

ఇకపోతే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఇటీవల నవంబర్ 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించింది.

సినిమా మంచి సక్సెస్ అయినందుకు ఆమె ప్రేక్షకులకు థాంక్స్అని చెప్పింది.అంతేకాకుండా తన జిమ్ కోచ్ ఎప్పుడు జిలేబి ఇవ్వలేదని, కానీ యశోద సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తనకు జిలేబి ఇచ్చినట్టుగా ఆమె వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోలో సమంత తన ఆరోగ్యం బాగో లేకపోయినప్పటికీ మళ్లీ జిమ్ లో కసరతులు చేయడం మొదలుపెట్టింది.చేతికి సెలైన్ వైర్ ఉన్నప్పటికీ జిమ్లో వర్కౌట్స్ చేస్తోంది సమంత.కాగా ఆ వీడియో పై పలువురి నెటిజన్స్ స్పందిస్తూ ఆరోగ్యం బాగో లేనప్పుడు ఇలా జిమ్ లో వర్క్ ఔట్స్ చేయడం అవసరమా అంటూ సమంత పై మండిపడుతున్నారు.

అది కూడా చేత్తో వర్కౌట్ చేస్తున్నావు.కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ నెటిజెన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మరి అభిమానుల కోరిక మేరకు సమంత మరికొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటుందా లేకపోతే అలాగే జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube