2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.చరణ్, తారక్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.
రిలీజ్ రోజున ఆర్ఆర్ఆర్ మూవీకి డివైడ్ టాక్ వచ్చిందని చరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ కోసం చాలా కష్టపడ్డానని చరణ్ చెప్పుకొచ్చారు.
రిలీజ్ రోజున 20 శాతం డివైడ్ టాక్ రావడంతో ఫీలయ్యానని చరణ్ కామెంట్లు చేశారు.
నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దామని అనుకున్నానని కానీ ఫ్యామిలీలో అందరూ హీరోలేనని చరణ్ చెప్పుకొచ్చారు.
నాన్నకు ఏవైనా అవార్డులు వస్తే వాటిని ఆఫీస్ లోనే ఉంచేవారని చరణ్ కామెంట్లు చేశారు.నేను నటుడిని కావాలని డిసైడ్ అయిన సమయంలో ఆ విషయం నాన్నకు చెప్పడానికి చాలా భయపడ్డానని చరణ్ కామెంట్లు చేశారు.
సినిమాకు దూరంగా మమ్మల్ని పెంచాలని నాన్న అనుకున్నారని చరణ్ చెప్పుకొచ్చారు.
అయితే మా నుంచి సినిమా దూరంగా వెళ్లలేదని చరణ్ కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని కొంతమంది ఫ్లాప్ అని కామెంట్లు చేసినా నెమ్మదిగా పరిస్థితి మారిందని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం మన సినిమాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా అలరిస్తున్నాయని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

జపాన్ లో కూడా ఆర్ఆర్ఆర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుందని చరణ్ అన్నారు.మంచి సబ్జెక్ట్, కథ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని చరణ్ పేర్కొన్నారు.అదే సమయంలో టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని చరణ్ చెప్పుకొచ్చారు.శంకర్ డైరెక్షన్ లో నటించడం తన లక్ అని ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చరణ్ కామెంట్లు చేశారు.







