తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని రీతిలో వర్షాలు పడుతున్నాయి.ముఖ్యంగా రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ప్రజలను ముక్కుతిప్పలు పెడుతున్నాయి.
మళ్లీ ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం పడటంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా చెన్నైలో ఎడతెరిపిలేని కుంభవృష్టి వాన పడుతోంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం 11 జిల్లాలలోని పాఠశాలలకు మరియు ఆఫీసులకు సెలవు ప్రకటించారు.ఇదే సమయంలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను.
ప్రభుత్వం రంగంలోకి దింపడం జరిగింది.అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 5093 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పాట్టు జిల్లాలలో… రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది.నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది.వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.వాయువ్య దిశగా కదిలి 12వ తారీకు ఉదయం నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరా ప్రాంతాల వైపు ప్రయాణిస్తుంది.13 నాటికి పశ్చిమ వాయువ్యతశగా కేరళ వైపు కదిరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.