Neena Gupta Bollywood : కావాలనే నాపై బోల్డ్, వ్యాంప్ ముద్ర వేశారు.. నీనా గుప్తా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటి మీనా గుప్తా గురించి మనందరికీ తెలిసిందే.నీనా గుప్తా ని చాలామంది ముక్కుసూటి వ్యక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు.

 Neena Gupta About Media Projected As Bold And Vamp Image , Neena Gupta , Bollywo-TeluguStop.com

ఏదైనా కూడా ఆమె మొఖం మీద చెప్పేస్తూ ఉంటుంది.ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆమె ఎటువంటి ట్రెండ్ ఇమేజ్ కి లొంగకుండా తనకు నచ్చిన విధంగా పాత్రలు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది నీనా గుప్తా.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నీనా గుప్తా మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

తన వ్యక్తిగత జీవితానికి ప్రొఫెషనల్ లైఫ్ కు అసలు పోలిక ఉండదు అని తెలిపింది.నా కెరియర్ పరంగా నాకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది నాకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవు.

కానీ మీడియా, సినీ వర్గాల తీరు నాకు నచ్చదు.ఎందుకంటే నేను వేసుకునే దుస్తులను బట్టి వాళ్ళు నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయడం చాలా బాధాకరం అని తెలిపింది నీనా గుప్తా.

నా కెరియర్ ఆరంభంలోనే నేను ధరించే దుస్తులను చూసి నాకు బోల్డ్ క్యారెక్టర్లు, ర్యాంప్ క్యారెక్టర్లు ఆఫర్ చేసేవారు అని వెల్లడించింది నీనా గుప్తా.

Telugu Characters, Bollywood, Neena Gupta, Ramp Characters, Vamp, Western Feats-

కానీ నేను సంప్రదాయ దుస్తులతో పాటు వెస్ట్రన్ అవుట్ ఫీట్స్ వేసుకోవడంతో నాకు కెరిర్ ప్రారంభంలోనే నాపై దర్శకనిర్మాతలకు సందేహాలు ఉండేవి.ఎందుకంటే దర్శకులు ట్రెడిషనల్ ఇండియన్ ఉమెనా? లేకపోతే గ్లామరస్ యాక్టర్ నా అన్న సందేహంతో వాళ్లు ఎటువంటి పాత్ర ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉండేవారు అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.ఇక నేను టెలివిజన్ రంగంలో సంప్రదాయంగా అక్క,అమ్మ,వదిన లాంటి పాతలు చేసినప్పుడు నన్ను ఒక మీడియా బోల్డ్ ఉమెన్ గా వ్యాంప్ గా ముద్ర వేసింది అని బాధపడింది నీనా గుప్తా.

దాంతో అప్పటి నుంచి అందరూ నాకు నెగిటివ్ క్యారెక్టర్లు మాత్రమే ఆఫర్ చేసేవారు అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube