తెలుగు చిత్ర పరిశ్రమలో శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమె ఎన్నో సీరియల్స్ లో నటిస్తూనే అనంతరం వెండితెరపై కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో అవకాశాలను అందుకొని ప్రేక్షకులను సందడి చేశారు.
ప్రస్తుతం శ్యామల బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈమే పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే శ్యామల తాజాగా నవీన్ చంద్ర హీరోగా నటించిన తగ్గేదే లేఅనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యాంకర్ గా వ్యవహరించారు.
నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శ్యామల యాంకర్ గా వ్యవహరించారు.
ఇకపోతే ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నటువంటి నటుడు రాజా రవీందర్ ఈ వేదికపై మాట్లాడుతూ దారుణంగా అందరి ముందు శ్యామల పరువు తీశారు.

ఈ క్రమంలోనే రాజా రవీందర్ మాట్లాడుతూ చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరికి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న యాంకర్ శ్యామల ఆంటీకి కూడా ధన్యవాదాలు అంటూ ఆమె పరువు మొత్తం తీశారు.ఈ విధంగా తనని ఆంటీ అని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్యామల ఏమాత్రం తగ్గకుండా నేను ఆంటీ అయితే మీరు తాతయ్య అయిపోయినట్లే అంటూ నటుడు రాజా రవీందర్ పై తిరిగి రివర్స్ పంచ్ వేశారు.ఇన్ని రోజులు అనసూయను ఆంటీ అన్న కారణంతో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రాజా రవీందర్ శ్యామలను కూడా ఆంటీ అని పిలవడంతో శ్యామల మాత్రం తనకు రివర్స్ పంచ్ వేసి అందరికీ షాక్ ఇచ్చారు.