భారత మాజీ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని గురించి మనందరికీ తెలిసిందే.మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ధోనీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అదేమిటంటే ధోని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించగా ధోని ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ధోని ఆయన సతీమణి సాక్షి కలసి ధోని ఎంటర్టైన్మెంట్ అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.ఈ విషయాన్ని ధోని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థలో మొదట తొలి తమిళ సినిమాను నిర్మించనున్నాడు.ఆ సినిమాకు రమేష్ తమిళ్ మణి దర్శకుడిగా వ్యవహరించనున్నారు.అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా ఎవరు నటించబోతున్నారు అన్నది మాత్రం వెల్లడించలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.
తన ఎంటర్టైన్మెంట్ సంస్థలో ధోని నిర్మించబోయే తొలి సినిమాలో హీరో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుణ్ మోహన్ లు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చలు కూడా నడుస్తున్నాయి.
కాగా ఈ విషయం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా విలువడనుంది.ధోని నిర్మించబోతున్న ఈ తొలి సినిమాను తమిళంతో పాటు అన్ని భాషల్లో అనగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.ఇందులో నటించడం కోసం మంచి పేరు ఉన్న నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.మరి ధోని నిర్మించబోతున్న తొలి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.అలాగే ధోని నిర్మించబోతున్న సినిమాలో హీరో హీరోయిన్ లుగా ఎవరు నటించనున్నారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది .