సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు ఏం చేశారన్న ఆయన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
మునుగోడును అభివృద్ధి చేస్తే ప్రచారానికి అంతమంది ఎందుకని నిలదీశారు.చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ హామీ ఏమైందో చెప్పాలన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు.పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారని అడిగారు.
అదేవిధంగా మునుగోడులో ఎంతమందికి రుణాలు మంజూరు చేశారు.? ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.