కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన కాంతార సినిమా ఇటీవలె విడుదల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.మొదట సెప్టెంబర్ 30న కన్నడలో విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
అంతేకాకుండా అంతకుముందు ఆయా భాషల్లో విడుదలైన సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది.ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్లకు పైగా వసూలను రాబట్టింది.
కాగా కన్నడలో ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ ను కొల్లగొట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాను చూసి పలువురు సినీ ప్రముఖులు హీరో రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
సామాన్యులు సైతం థియేటర్లో సినిమాను చూసి రిషబ్ శెట్టి ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.కాగా రిషబ్ శెట్టి కర్ణాటక సంస్కృతి సాంప్రదాయాలను అద్భుతంగా తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
మరి ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది.అదేమిటంటే కాంతార సినిమాను చూస్తూ ఒక ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.
కర్ణాటకకు చెందిన రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి థియేటర్లో సినిమాను చూస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు.వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం అతన్ని ఆసుపత్రికి తరలించారు.
అతని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.








