టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజా హెగ్డే కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా తమిళ హిందీ భాషలలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ ఏడాది ఈమె నటించిన మూడు భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
మూడు సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే తాజాగా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
అదేవిధంగా హిందీలో సల్మాన్ ఖాన్ వెంకటేష్ కలిసిన నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కాలుకు బ్యాండేజ్ వేసినటువంటి ఫోటోని షేర్ చేస్తూ తనకు కాలి చీలమండలో చీలిక ఏర్పడిందని ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోని షేర్ చేస్తూ తెలియజేశారు.ఇలా ఈమె కాలికి దెబ్బ తగలడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం కోసం షూటింగ్ కి విరామం చెప్పినట్లు అందరూ భావించారు.
అయితే తాజాగా పూజ హెగ్డే మరొక ఫోటోని షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఈమెకి కాలు దెబ్బ తగిలినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.ఈ క్రమంలోనే మేకప్ రూమ్లో మేకప్ వేసుకుంటున్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో కాలికి దెబ్బ తగిలినా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నారని అర్థమవుతుంది.ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ షో నడవాల్సిందే అంటూ క్యాప్షన్ జోడించారు.
ఇలా కాలికి దెబ్బ తగిలిన ఈమె షూటింగుకు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్లో పాల్గొనడంతో ఎంతోమంది ఈమెకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.