ఇండస్ట్రీ లో చాల మంది స్నేహితులు ఉంటారు.సినిమా ఇండస్ట్రీ లో ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికి బయట మాత్రం వారి స్నేహం కొనసాగుతూనే ఉంటుంది.
ఆలా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోస్ చాల మంది స్నేహితులుగా చలామణి కావడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే కాలం మూడు దశాబ్దాలకు వెనక్కి తిప్పితే అప్పుడే హీరోయిన్ గా హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నగ్మా మనకు బాగా తెలిసిన హీరోయిన్.
అయితే నగ్మా హిందీ భాషలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ ఒక దశాబ్దానికి పైగా చక్రం తిప్పింది.
మరి నగ్మా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ముఖ్యంగా సౌత్ లో పెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఒక హీరోయిన్ అనే సంగతి ఎవరికి తెలియదు.
ఒక హీరో మరొక హీరోయిన్ కి అవకాశం ఇప్పిస్తే వారికి ఉన్నవి లేనివి కలిపి మసాలా జోడించి వార్తలు రాసే మన మీడియా, ఒక హీరోయిన్ మరొక హీరోయిన్ కి అవకాశం ఇప్పిస్తే హైలెట్ చేయకపోవడం లో పెద్ద వింత ఏముంటుంది.అందుకే నగ్మా స్టార్ హీరోయిన్ అవ్వడానికి కారణం ఎవరు అనే విషయం పెద్దగా మనకు తెలియదు.
కానీ నగ్మాను తెలుగు నిర్మాతలకు పరిచయం చేసిన హీరోయిన్ మరెవరో కాదు దివ్య భారతి.
పంతొమ్మిది ఏళ్లకే ఆకాశం అంత స్టార్ డం చూసి తిరిగి రాని లోకాలకు వెళ్లిన దివ్య భారతి కి నగ్మా మంచి స్నేహితురాలు.అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన నగ్మాను తెలుగు నిర్మాతలకు సజెస్ట్ చేసేది.దివ్య భారతి అప్పటికే స్టార్ హీరోయిన్ గా బాగా పాపులర్ అవవడం తో ఆమెకు కొత్త సినిమాల్లో నటించడానికి డేట్స్ అడ్జస్ట్ అయ్యేవి కాదు.
దాంతో తాను నటించలేని కొన్ని సినిమాలకు నగ్మా పేరు సజెస్ట్ చేయడం తో ఆమెకు మంచి అవకాశాలు దక్కాయి.ఆలా తెలుగు సినిమాల్లో సూపర్ హిట్ హీరోయిన్ గా నగ్మా ఎదిగింది.
ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకే దివ్య భారతి కన్ను మూసింది.