BiggBoss 6లో ఈ సీజన్ అంతా కూడా కంటెస్టంట్స్ ఆశించిన రేంజ్ లో ఆట సరిగా ఆడట్లేదు.ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల విషయంలో ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయట్లేదు.
అంతకుముందు ఆల్రెడీ ఇదే సీజన్ హోటల్ టాస్క్ లో బిగ్ బాస్ ని నిరాశపరచిన హౌస్ మెట్స్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు.ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మెట్స్ అందరికి ఒక్కో హీరో, హీరోయిన్ పాత్ర ఇచ్చి వారిని ఇమిటేట్ చేయమని చెప్పారు.
అయితే ఈ టాస్క్ లో వారు బిగ్ బాస్ చెప్పినప్పుడు తప్ప మిగతా టైం లో పాత్రలో ఉండాల్సి ఉంటుంది.టాస్క్ మధ్యలో రేవంత్, అర్జున్ కళ్యాణ్ ల మధ్య చిన్న గొడవ జరిగితే అందులో శ్రీ సత్య కలుగచేసుకుని రేవంత్, అర్జున్ కళ్యాణ్ టాస్క్ ని మర్చిపోయి పారల నుంచి బయటకు వచ్చేలా చేసింది.
ఇచ్చిన టాస్క్ ని సరిగా చేయట్లేదని బిగ్ బాస్ హర్ట్ అయ్యాడు.అందుకే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేదని చెప్పేశాడు.అంతేకాదు ఆట మీద ఎవరికి ఆసక్తిలేదో వారు ఇంటి నుంచి వెళ్లొచ్చని బిగ్ బాస్ గేట్లు కూడా తెరిచాడు.ఈ సీజన్ అంత వరస్ట్ హౌస్ మెట్స్ మరే సీజన్ లో చూడలేదని అన్నారు బిగ్ బాస్.
అసలే రేటింగ్ లేక డల్ అయిన బిగ్ బాస్ షోలో హౌజ్ మెట్స్ కి ఇలా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం హాట్ న్యూస్ గా మారింది.