Onions Benefits : ఉల్లిపాయ ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది...

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది.అందువల్ల చాలామంది ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలను, కూరగాయలను ఉపయోగిస్తున్నారు.

 Health Benefits Of Eating Onions,onions,eating Onions,vinegar,bad Cholestrol,cho-TeluguStop.com

కూరగాయలన్నిటిలో ఉల్లిపాయలో ప్రత్యేకమైన పోషకాలు ఉన్నాయి.ఉల్లిపాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎందుకంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది.

అయితే ఉల్లిపాయను తినడం ఎలానో తెలుసుకొని తింటే శరీరానికి ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది.

ఉల్లిపాయలో వెనిగర్ కలిపితే, అది శరీరానికి రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది.అలాంటి ఉల్లిపాయ తినడం వల్ల గుండె నుంచి జీర్ణ సమస్యల వరకు అన్ని రకాల వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయలు చాలా విటమిన్ల సమూహం ఉంటుంది.

Telugu Bad Cholestrol, Cholestrol, Benefits, Tips, Immunity System, Vinegar-Telu

ఉల్లిపాయలో సోడియం, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ వంటి మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయల్లో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఉల్లిపాయ వెనిగర్ ను తయారు చేసుకోవడానికి ఉల్లిపాయను మధ్యలో నుండి కట్ చేసి, అందులో వెనిగర్ మరియు నీరు కలిపి కాస్త ఉప్పు వేసి ఉంచాలి.

వెనిగర్ తో ఉల్లిపాయ కూడా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Telugu Bad Cholestrol, Cholestrol, Benefits, Tips, Immunity System, Vinegar-Telu

ఉల్లి నీ వెనిగర్ తో పాటు కలిపి తీసుకుంటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది.ఇందులో విటమిన్ బి9 మరియు ఫోలేట్ ఉన్నాయి.

ఒక పరిశోధనలో తెలిసిన విషయమేమిటంటే వెనిగర్లో ముంచిన ఉల్లిపాయలు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

అటువంటి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్, బ్రెస్ట్ మరియు కోలన్ క్యాన్సర్ ప్రమాదం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.

వెనిగర్‌తో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా దరిచేరవు.ఉల్లిపాయను ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube