తెలుగు సినిమా ప్రేక్షకులకు రాజమౌళి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలన పరిచయం చేసిన దర్శక ధీరుడు మన జక్కన్న.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఫ్లాప్ అంటే ఏంటో కూడా తెలియకుండా విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.స్టూడెంట్ నం.1 సినిమా తో తొలిసారిగా దర్శకత్వం చేపట్టి సినిమాల్లో రాణించాలనుకున్న తన కళను రాజమౌళి సాకారం చేసుకున్నాడు.ఇక స్టూడెంట్ నం.1 కోసం కేవలం నాలుగు కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టగా అది 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ సినిమా గా నిలిచింది.
ఈ సినిమాలో తర్వాత మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్భుతమైన విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడం తో రాజమౌళి తన ప్రతిభను దేశం నలుమూలన చాటుకున్నాడు.
ఇక రాజమౌళి దర్శకత్వ ప్రతిభ చూసి ప్రస్తుతం దేశం అంత కూడా గర్వపడుతుంది.ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక ఓటమి కూడా లేదు.ఇక అసలు విషయం ఏమిటంటే రాజమౌళి అప్పుడప్పుడు తన సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటాడు.తన సినిమా లోనే బయట దర్శకుల సినిమాల్లో కూడా కనిపించడం కేవలం రాజమౌళికే చెల్లింది.
అలా రాజమౌళి, మరొక స్టార్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన రెయిన్ బో అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, పోయిందో కూడా ఎవరికి తెలియదు.ఇక కోడి రామ కృష్ణ ఆ మధ్య కాలంలో కన్ను మూసారు.అయితే రాజమౌళి కి ఇప్పటి వరకు విజయవంతమైన సినిమాలు మాత్రం చేయగా అయన నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టి అట్టర్ ఫ్లాప్ సినిమాల జాబితాలో నిలిచింది.
అలా మొదటి సారిగా రాజమౌళి నటించిన ఫ్లాప్ సినిమాగా రెయిన్ బో నిలిచింది.