రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన చిరంజీవి.. ఎన్ని రూ.కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు పారితోషికం విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారనే సంగతి తెలిసిందే.రాజకీయాల్లోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యంగ్ జనరేషన్ స్టార్ హీరోల హవా పెరగడంతో పాటు ఆ హీరోల రెమ్యునరేషన్లు సైతం భారీగా పెరిగాయి.

 Megastar Chiranjeevi Remuneration Hiked Details Here Goes Viral , Chirenjeevi, R-TeluguStop.com

చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ఆచార్య సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు మాత్రం ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి రేంజ్ లో అందుకునే మరో హీరో అయితే లేరని చెప్పవచ్చు.ఈ సినిమా నిర్మాతలలో చరణ్ ఒకరు అయినా చిరంజీవి రెమ్యునరేషన్ ను మాత్రం సినిమా రిలీజ్ కు ముందే ఇచ్చేశారని బోగట్టా.

మరోవైపు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినా రెమ్యునరేషన్ తీసుకోలేదు.అయితే రామ్ చరణ్ త్వరలో సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ గా కలిసి గిఫ్ట్ రూపంలో రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

5 కోట్ల రూపాయల విలువైన బహుమతిని సల్మాన్ ఖాన్ కు ఇవ్వాలని చరణ్ డిసైడ్ అయ్యారని బోగట్టా.మరోవైపు ఆరు రోజుల్లో ఈ సినిమా 52 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Telugu Acharya, Chiranjeevi, Salman Khan, Tollywood-Movie

మరో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉండగా ఆ రేంజ్ లో గాడ్ ఫాదర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువు కాదు.దసరా సెలవులు మొదలైన సమయంలోనే గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమాకు మరింత బెనిఫిట్ కలిగి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube