విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు.విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. టీడీపీ, ఎల్లోమీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కొన్ని పత్రికలు కులం అనే ఇంకుతో విషపు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు.
వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది.కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు.ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయం.
వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది.దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యజమానులు క్లారిటీ ఇచ్చారు.
సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది.ప్రభుత్వ చర్యలతో 400 కుటుంబాలకు మేలు జరిగింది.
64 ప్లాట్ యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే.ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారు.
కానీ, భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి.కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయి.
కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింది.రామోజీకి నైతిక విలువలు లేవు.
పుట్టుకే అనైతికం.’అని తీవ్రంగా మండిపడ్డారు
.