వి వి వినాయక్ చేసిన ఈ తప్పుల వల్లే చెన్న కేశవ రెడ్డి ఫ్లాప్ అయ్యిందా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకులు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు.ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యాక్షన్ దర్శకులలో వివి వినాయక్ ఒకరు.

 Balakrishna Chenna Keshava Reddy Flop Reasons Details, Chennakeshava Reddy, Nand-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరితో దాదాపు బ్లాక్ బస్టర్ సినిమాలను తీసాడు వినాయక్.ఇక మిగతా దర్శకులతో పోల్చి చూస్తే వివి వినాయక్ టేకింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాలి.

ఇకపోతే బాలయ్యతో కూడా ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్లు అందుకున్నాడు.

కానీ భారీ అంచనాల మధ్య 2002 సెప్టెంబర్ 25వ తేదీన వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా మాత్రం అంచనాలు తారుమారు చేసి చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించిన మణిశర్మ సంగీతం అందించిన సినిమా మాత్రం హిట్ కొట్టలేదు.అయితే ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

కాగా ఈ సినిమా విజయం సాధించక పోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్య ఈ సినిమాలో 22 ఏళ్ళ పాటు జైలులో ఉండడం అనేది ప్రేక్షకులకు నమ్మేలా అనిపించదు.

బాలయ్య భార్య పాత్రలో నటించిన టబూ భర్త చనిపోయాడా లేకపోతే ఆరా తీయాలా అన్న విషయం పట్టించుకోదు.భర్త వెళ్లిపోయిన తర్వాత చనిపోయాడని ఫిక్స్ అవుతుంది.

కొడుకు చదివి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.అయితే తండ్రి పేరు అయినా రాసినట్లు ఉండాలి.

కానీ తల్లిని అడగడం కూడా ఇక్కడ చూపించరూ.

Telugu Balakrishnadual, Chennakeshava, Vv Vinayak, Tabu-Movie

అయితే ఎలాంటి తప్పు చేయకుండానే బాలయ్యను జైల్లో పెడతారు.దీంతో నేనేం తప్పు చేశాను నా నేరమేంటి నన్ను ఎందుకు జైల్లో పెట్టారు అని కూడా మొర పెట్టుకోవడం ఉండదు.ఇక్కడే సినిమాలో లాజిక్ మిస్ అవుతుంది.

అంతేకాదు సినిమాలో బాలయ్య గట్టిగా అరిస్తేనే గుండెలు ఆగిపోవడం ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేకపోయారూ.కథలో దమ్ము లేకపోవడం కూడా ఈ శ్రమ కావడానికి కారణం.

మంచి కథను సిద్ధం చేసుకున్నానని వినాయక్ సినిమా విడుదలకు ముందు చెప్పినప్పటికీ కథ మాత్రం ప్రేక్షకులకు కరెక్ట్ కాదు.

Telugu Balakrishnadual, Chennakeshava, Vv Vinayak, Tabu-Movie

బాలయ్య గత సినిమాలను చూసి బీభత్సమైన థింకింగ్ చేసిన వివి వినాయక్ ఎలివేషన్స్ పరంగా సక్సెస్ అయినప్పటికీ కథ పై ఫోకస్ పెట్టడం మాత్రం మర్చిపోయాడు.సినిమా చూస్తున్నప్పుడు ఇప్పటికే బాలయ్య నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి లాంటి సినిమాలు చేసేసాడు మళ్ళీ ఇది ఎందుకు అన్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది.ఇలా ఈ కారణాల వల్లే భారీ అంచనాల మధ్య వచ్చిన చెన్నకేశవరెడ్డి చివరికి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube