రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా కామెంట్ చేస్తున్నారని వాళ్ళని జైలుకు పంపించాలని పేర్కొన్నారు.
విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే టీడీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ రిజర్వ్ బ్యాంక్ కి టిడిపి నాయకులు లేఖలు రాశారని ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
అంతేకాదు త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో మూడు రాజధానులు అంశంపై చర్చించే అవకాశం ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు.ఎంతో ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శించారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 90 శాతానికి పైగా తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.