గత కొన్నేళ్ల ముందు సినిమా పరిశ్రమ కు ఇప్పటి పరిశ్రమకు చాలా తేడా ఉంది.అప్పట్లో సినిమా విడుదల అయిన నిర్మాత కు పెద్దగా నష్టం ఉండేది కాదు.
కానీ ఇప్పుడు సినిమా విడుదలవుతుంది అంటే నిర్మాతకు వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే కరోనా తరువాత అలాగే ఓటిటి దెబ్బతో సినిమా పరిశ్రమ కుదేలు అయిపోయింది.సినిమా థియేటర్ కి జనాలు రావాలంటే కత్తి మీద సాముల ఉంది ప్రస్తుతం పరిస్థితి దాంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది.
కానీ సినిమాలో కంటెంట్ ఉంటే నిర్మాతర జేబులో నిండుతాయి అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.కంటెంట్ బాగా ఉంటే తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా విజయం సాధిస్తాయి అని చెప్పడానికి ఈ సినిమాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గీత గోవిందం
విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా చేసిన సినిమా గీతాగోవిందం ఈ చిత్రానికి కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తిరిగెక్కి 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఏకంగా 55 కోట్ల లాభాల వర్షాన్ని కురిపించింది.
కార్తికేయ 2
నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సినిమా ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది కానీ ఈ చిత్రానికి కేవలం 30 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు.
ఉప్పెన
మెగా హీరో వైష్ణవ తేజ్ తొలిసారిగా నటించిన సినిమా ఉప్పెన ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగా, ఏకంగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి 30 కోట్ల రూపాయల లాభాలను ఇచ్చింది.
అర్జున్ రెడ్డి

విజయ్ దేవరకొండకు తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి.ఈ చిత్రానికి కేవలం ఐదు కోట్ల రూపాయల మాత్రమే పెట్టుబడి పెట్టగా 26 కోట్ల కలెక్షన్స్ సాధించి 20 కోట్ల రూపాయల లాభాలను తెచ్చి పెట్టింది.
బింబిసారా

కళ్యాణ్ రామ్ హీరోగా తన శ్రీయ ప్రొడక్షన్లో వచ్చిన చిత్రం బింబిసారా ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టగా ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది దాదాపుగా 20 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది.
సీతారామం

16 కోట్ల రూపాయల పెట్టుబడితో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన తాజా హిట్ సినిమా సీతారామం ఇక ఈ సినిమా 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి 22 కోట్ల రూపాయల లాభాలను కూడా తెచ్చిపెట్టింది.