విశాఖపట్నం, ఆగస్టు 21: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.విశాఖలో ఆదివారం బిజెపి నిర్వహించిన యువ సంఘర్షణ యాత్రలో మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన విమర్శలను అమర్ నాథ్ తీవ్రంగా తిప్పికొట్టారు.
ఆదివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా రంజకమైన పాలన చేస్తున్న జగన్మోహనరెడ్డి పై కేంద్ర నాయకులు విమర్శించడం హాస్యాస్పదమనీ అమర్ నాథ్ అన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా వుందని ఠాకూర్ అనడంలో వాస్తవం లేదని అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో నాలుగున్నర లక్షల మందికి వుద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహనరెడ్డికి మాత్రమే దక్కింది అని అన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో వుద్యోగాలు ఇచ్చారా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టీల్ ప్లాంట్ ని విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దపడుతోందని, దానిని ఎవరికి ఎంత మొత్తానికి అమ్మ చెబుతున్నారో అందులో మీ కమిషన్ ఎంతో ప్రజలకు తెలియజేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్నా ప్రత్యేక హోదాను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని అమర్నాథ్ ప్రశ్నించారు… అలాగే పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆర్థిక సహకారం అందించలేక పోతుందని అని ప్రశ్నించారు.
పోలవరం : నిర్మాణానికి ఆయన ఖర్చులో రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖం సంతోషాలతో ఉన్నారని కేంద్ర మంత్రి ఠాకూర్ తెలుసుకోకుండా సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెచ్చిన స్క్రిప్ట్ చదవడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో ఒక్క సీటు, ఒక్క ఓటు లేని బిజెపి జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆ పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని అమర్ నాథ్ అన్నారు.దేశంలో అధికారంలో వున్న బిజెపి వాస్తవాలు గమనించకుండా అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలని మంత్రి అమర్ నాథ్ హితవు పలికారు.
పవన్ తో పొత్తు మాకెందుకు?
పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మనకెందుకు, ఆయనతో పొత్తు వై సి పి కి అవసరం లేదని అమర్ నాథ్ చెప్పారు.ఆయన ఖాళీ గా వుంటూ సినిమాలు చూస్తూ నాయకులకు పేర్లు పెడుతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నాడని విమర్శించారు.
తమ పార్టీ ఎప్పుడూ వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించడం లేదని, మాకు ఎప్పుడూ ప్రజలతోనే పొత్తు వుంటుందని మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు.టిడిపితో కలిసి ప్రయాణి0చాలాని పవన్ చెప్పకనే చెబుతున్నారు అని అన్నారు.
పోటీ చేసిన ప్రతి చోటా ఓడిపోయిన పవన్ తో పొత్తు కావాలని ఎవరు కోరుకుంటారు? అని అమర్ ప్రశ్నించారు.పవన్ చివరికి చిరంజీవిని కూడా బయటకు లాగుతున్నారని అమర్ నాథ్ విచారం వ్యక్తం చేశారు.
చిరంజీవి జగన్మోహనరెడ్డికి నమస్కారం పెట్టాలా? అని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని అన్నారు.జగన్మోహనరెడ్డి సతీమణి భారతి చిరంజీవిని ఎంతగా గౌరవించి పంపారో పవన్ తెలుసుకోవారన్నారు.
పవన్ ఓడిపోయిన భీమవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవి ఆలింగనం చేసుకోవడాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు.పవన్ కమ్మ జనసేన నడుపుతున్నారని ఇప్పటికీ చెపుతానని అన్నారు.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రొడక్షన్ లో మనోహర్ నడుపుతున్న పార్టీని కమ్మ జనసేన కాదని ఎలా అనగలమినీ ఆయన ప్రశ్నించారు.తాను కులాల గురించి మాట్లాడనని చెబుతూనే గంటల తరబడి కులాల గురించి మాట్లాడారని అమర్ నాథ్ అన్నారు.
పెళ్లిళ్లు పేరoటాలకు వచ్చి లోకేష్ రాజకీయాలు చేయడం అవసరమా ? అని అమర్ నాథ్ ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డి మగతనం, లోకేష్ మగతనం ఏమిటో ప్రజలకు తెలుసు అని అన్నారు.
పేరoటాలకు వచ్చిvతాంబూలం, జాకెట్లు ముక్కలు ఇస్తే తీసుకొని వెళ్ళేయిపోవాలే తప్ప లోకేష్ కు విమర్శలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.లోకేష్ రాజకీయాలకు పనికి రాదు పేరంటానికే పనికి వస్తాడని అమర్ నాథ్ అన్నారు.