మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిన చిత్రాలు చాలానే ఉన్నాయి.మరి అలాంటి క్లాసిక్ హిట్స్ లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి.
ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నటించింది.వీరిద్దరి జంటకు సూపర్ హిట్ అనే పేరు వచ్చింది.
ఈ సినిమాలో వీరి జోడీని తప్ప మరెవరిని ఉహించుకోవడానికి కూడా ఫ్యాన్స్ ఇష్టపడరు.
మరి అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ముఖ్యంగా నిర్మాత అశ్వనీదత్ ఇప్పటికే బాహాటంగానే పలుసార్లు చెప్పారు.ఇక తాజాగా ఈయన నిర్మించిన సీతా రామం సినిమా సక్సెస్ కొట్టిన సంతోషంలో మరోసారి ఈయన ఈ సీక్వెల్ గురించి మాట్లాడారు.
ఈ సినిమా సీక్వెల్ ను మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ తోనే చేస్తానని.మరెవరు ఈ పాత్రకు న్యాయం చేయలేరని ఆయన చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ ను సైతం భాగం చేయాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అనందం అంతా ఇంతా కాదు.ఇది ఇలా ఉండగా మెగాస్టార్ సైతం ఈ సినిమా సీక్వెల్ ను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నారట.
అందుకే ఈ సీక్వెల్ కోసం సరైన డైరెక్టర్ ను వెతుకుతున్నారట.
![Telugu Aswani Dutt, Chiranjeevi, Jagadekaveerudu, Jvak Sequel, Ram Charan, Ramch Telugu Aswani Dutt, Chiranjeevi, Jagadekaveerudu, Jvak Sequel, Ram Charan, Ramch]( https://telugustop.com/wp-content/uploads/2022/08/Jagadeka-Veerudu-Athiloka-Sundari-JVAK-Sequel-Ram-Charan-Aswani-Dutt.jpg)
ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించాలని అందుకు సరైన డైరెక్టర్ చాలా అవసరం అని చిరు భావించి డైరెక్టర్ వేటలో ఉన్నారట.ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ పేరు ఈ సీక్వెల్ కోసం వినిపిస్తుంది.మరి చిరు ఈయననే ఫైనల్ చేస్తాడా లేదంటే వేరే ఎవరినైనా ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
అలాంటి డైరెక్టర్ దొరికితే వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించి ఆలోచనలో అశ్వినీదత్ ఉన్నారు.చూడాలి ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.