పిల్లలు జామ పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

జామపండు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జామపండు తినే సమయంలో పండు అంత రుచిగా అనిపించినా అందులో ఉండే విత్తనాలే కాస్త ఇబ్బందిగా ఉంటాయ్.

 Health Benefits Of Eating Guava, Children, Eat Guava, Health Benefits, Fiber, Fa-TeluguStop.com

ఇక అలాంటి జామపండ్లు చిన్న పిల్లలు తినొచ్చా, తినకూడదా అనే సందేహం చాలా మందికి ఉంది.ఎందుకంటే జామపండులోని విత్తనాలు జీర్ణం కావనే అభిప్రాయంలో కొందరు ఉంటారు.

అందులో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

జామపండు తింటే అందులో విత్తనాలు జీర్ణం కావు అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే.

నిజానికి జామపండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్.పెరిగే పిల్లలకు జామపండు ఆహారంలో భాగంగా ఇవ్వాలి.

ఎందుకంటే వీటిలో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి.దీని వల్ల వయసుకు తగినట్టుగా పెరుగుతారు.

ఇంకా కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు, పాలు నట్స్ ఇలాంటివి కూడ పిల్లలు బాగా ఎదగడానికి సహాయపడతాయి.

జామ పండులోని ఫోలిక్ ఆమ్లం పిల్లలలో మెదుడు, వెన్నెముక సంబంధిత లోపాలను నివారించడంలో సహాయపడుతుంది.

ఇంకా పిల్లలలో నాడీ, ప్రసరణ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.జామపండులో విటమిన్ ‘సి ‘పుష్కలంగా ఉంటుంది.కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఒక జామపండులో నారింజ పండు కంటే నాలుగు రేట్లు ఎక్కువ విటమిన్ ‘సి ‘ఉంటుంది.

కంటి చూపు తగ్గకుండా ఉండడానికి జామపండు సహాయపడుతుంది.

జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి పిల్లలలో జీవక్రియను మెరుగు పరచడంలో సహాయపడుతుంది.మలబద్దకాన్ని కూడ నివారిస్తుంది.

అంతే కాదు రక్త ఉత్పత్తిని పెంచుతుంది.ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పిల్లలను క్యాన్సర్ ప్రమాదం నుండి నిరోధించడంలో సహాయపడడతాయి.

ఇది అల్జీమర్స్, పార్కిన్స్ వ్యాధులు, హైప్రాక్సియా వంటి రుగ్మతల నుంచి కాపాడుతుంది.జామకాయలో క్యాల్షియం, పోషకాలు వున్నాయి.

ఇవి పిల్లలలో ఎముకలు అభివృద్ధికి సహాయపడుతుంది.జామపండు విత్తనాల్లో లినోలెయిన్, ఫినోలిక్ వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి పిల్లల మెదుడు, ఇతర కణజాల వ్యవస్థల అభివృద్ధికి సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube