అమీర్ ఖాన్ హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు థియేటర్లలో విడుదలైంది.ఫారెస్ట్ గంప్ సినిమాకు ఈ సినిమా రీమేక్ కాగా కరీనా కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.ఈ సినిమాకు నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
అమీర్ ఖాన్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
హృదయాన్ని హత్తుకునేలా ఈ సినిమా ఉందని ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోయినా సెకండాఫ్ బాగుందని ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే నాగచైతన్య కోసమే ఈ సినిమాను చూసేవాళ్లు మాత్రం నిరాశ చెందడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆమాయకుడైన యువకుడు ఇండియన్ ఆర్మీలో చేరి అక్కడ ఎదురైన సంఘటనల వల్ల ఏ విధంగా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో అని అమీర్ ఖాన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చైతూ పాత్ర కొంత సమయానికే పరిమితమైనా అతని నటన మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఫస్టాఫ్, పాటలు, లాజిక్ లేని సీన్లు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి.
మరోవైపు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ వల్ల కూడా ఈ సినిమాకు ఒకింత నష్టం కలుగుతోంది.లాల్ సింగ్ చడ్డా సినిమాకు 300 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా హిట్టైనా చైతన్య కెరీర్ కు బెనిఫిట్ కలగదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.