సినిమాల్లో నటిస్తున్నాం కదా అని ఎవరేం మాట్లాడినా వింటాము లేదా ఎవరు ఏం కామెంట్ చేసినా పడతాము అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటే సహించేది లేదు అంటున్నారు నేటితరం హీరోలు హీరోయిన్స్.మై లైఫ్, మై రూల్స్ అంటూ ఎవరేమనుకున్నా మాకు అవసరం లేదు, ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా మా లైఫ్ మా ఇష్టం అంటున్నారు.
ఎప్పుడు తల్లి కావాలో, ఎలాంటి మేకప్ వేసుకుని బయటకు రావాలో, ఎలాంటి ఐటెం సాంగ్స్ చేయాలో అంతా మా ఇష్టమే మీకు నచ్చకపోతే కళ్ళు మూసుకోండి కానీ మా లైఫ్ ని మేమే డిసైడ్ చేసుకుంటాం మా లైఫ్ మీద మీ డెసిషన్ ఏంటి అని నెటిజన్స్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇస్తున్నారు ప్రస్తుతం హీరోయిన్లు.అసలు ఆ కామెంట్స్ ఏంటో ఆ ట్రోల్ల్స్ ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం.
అలియా భట్
పెళ్లయిన మూడు నెలలు తిరగకుండానే తల్లి అయినందుకు ఆలియా భట్ పై తీవ్ర విమర్శలు చేశారు నెటిజన్స్.దాంతో అలియా సీరియస్ అయ్యింది.
అభిమానానికి కూడా హద్దు ఉండాలి అంటుంది ఆలియా భట్.తల్లి కావాలన్నది పూర్తిగా తన నిర్ణయం అని, నెగటివ్ కామెంట్స్ చేసినంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నాకు నచ్చినట్టుగా పిల్లల్ని కంటానంటూ తన లైఫ్ తన ఇష్టమే అంటూ డోంట్ కేర్ చెప్తోంది ఆలియా.
కరీనా కపూర్
తన లైఫ్ లో ఏం జరిగినా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఏం రైట్ ఉంటుంది అని అని నేరుగా ప్రశ్నిస్తోంది కరీనా.ఇటీవల కాలంలో ఒక జిమ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది కరీనా, దాంట్లో మేకప్ లేకుండా కరీనాను చూసిన కొంత మంది ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేశారు.నేను మేకప్ వేసుకోవాలా లేదా అనేది పూర్తిగా నా ఇష్టమే, మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి, మీకు ఎలాంటి రైట్ లేదు అంటూ కొట్టి పారేస్తోంది కరీనా.
సమంత
అక్కినేని కోడలు అయ్యాక సమంత ఎక్స్పోజింగ్ చేస్తుండటం తో తనపై నెగిటివ్ గా దాడి జరుగుతోంది సోషల్ మీడియాలో.అయితే ఇటీవల కాలంలో కరణ్ జోహార్ తో ఒక షోలో పాల్గొన్న సమంత, నాగచైతన్య ని హస్బెండ్ అన్నందుకు ఆమె ఎక్స్ హస్బెండ్ అంటూ సమాధానం ఇచ్చింది.దాంతో అక్కినేని ఫ్యామిలీలో నువ్వు లేకపోతే నీకు అసలు హీరోయిన్ అయ్యే అవకాశం కూడా లేదంటూ కొంతమందిని నెటిజన్స్ ఆమెపై తీవ్ర విమర్శలు చేయగా, వాటిని అంతే స్పీడుగా సమంత కొట్టి పారేసింది.
నేను ఎలాంటి పని చేయాలన్నది నా ఇష్టమే నా జీవితంలో ఎవరికి స్థానం లేదు అంటూ గట్టిగానే సమాధానం చెబుతోంది సమంత.