ఆగష్టు 5న రిలీజ్ అవుతున్న సీతారామం సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్.హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి అశ్వనిదత్ నిర్మించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడీగా నటించిన ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కన్నడ భామ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లవర్ బోయ్ గా దుల్కర్ ఆకట్టుకునేలా ఉన్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ కి అంతకుముందు తెలుగులో నటించిన మహానటి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.మహానటి సినిమాలో మెయిన్ లీడ్ కీర్తి సురేష్ మాత్రమే అయినా దుల్కర్ సల్మాన్ కూడా కీ రోల్ చేశారు.
అయితే ఆ సినిమా రిలీజ్ టైం లో దుల్కర్ సల్మాన్ తెలుగులో ప్రమోట్ చేయలేదు.అందుకు కారణం చెప్పారు దుల్కర్.ఆ టైం లో తన కాలికి దెబ్బ తగలడం వల్ల మహానటి ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నానని అన్నారు.మహానటి సినీ నిర్మాతలే ఇప్పుడు సీతారామం సినిమా తెరకెక్కించారు.
ఆ సినిమా ప్రమోషన్స్ మిస్సైనా సీతారామం కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.హైదరాబాద్ లో ఈవెంట్ పలు ఇంటర్వ్యూస్ ఇచ్చిన దుల్కర్ అండ్ టీం విజయవాడలో పివిపి మాల్ లో ప్రమోషన్స్ చేశారు.
ఆ వెంటనే వైజాగ్ వెళ్లి అక్కడ సీతారామం ప్రమోషన్స్ చేస్తున్నారు.ఒక సినిమాకి ఎంత ఎక్కువ ప్రమోషన్స్ చేఏస్తే అంత ఎక్కువ ఆడియెన్స్ కి రీచ్ అవుతుందని తెలిసిందే.
అందుకే సీతారామం సినిమా కోసం దుల్కర్ అండ్ టీం మొత్తం చుట్టేస్తున్నారు.ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది.