సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లకు హిట్ కాంబినేషన్ గా పేరు ఉంటుంది. చైతన్య సమంత కలిసి నటిస్తే సినిమా హిట్ అనే భావన భావన చాలామందిలో ఉంది.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఏమాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలు తెరకెక్కగా ఆటోనగర్ సూర్య మాత్రమే అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.చైసామ్ తర్వాత రోజుల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య సమంత ఎవరూ ఊహింని విధంగా విడిపోయి షాకిచ్చారు.చైతన్య సమంత మళ్లీ కలిస్తారా నటిస్తారా అనే ప్రశ్నకు వాళ్లిద్దరూ కలిసి నటించే అవకాశమే లేదని చాలామంది భావిస్తున్నారు.
నాగచైతన్యకు తాజాగా ఇదే ప్రశ్న ఎదురుకాగా చైతన్య ఆ ప్రశ్నకు స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను సమంత మళ్లీ కలిసి నటిస్తే క్రేజీగా ఉంటుందని చైతన్య అన్నారు.
అయితే నేను సమంత కలిసి నటించడం జరుగుతుందో లేదో నేను చెప్పలేనని చైతన్య చెప్పుకొచ్చారు.ఈ ప్రపంచానికే తెలియాలని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ నాగచైతన్య కామెంట్లు చేశారు.
పలు సందర్భాల్లో సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని నాగచైతన్య చెప్పుకొచ్చారు.మరి చైతూతో యాక్ట్ చేయడం గురించి సమంత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

చైతన్య సమంత విడిపోయినా రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ కలిసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మనస్పర్ధల వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని వీళ్లిద్దరూ కలవడానికి ఎంతో సమయం పట్టదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.చైసామ్ కలవడం సాధ్యమవుతుందో లేదో చూడాలి ఉంది.మరోవైపు థాంక్యూ సినిమా ఫలితం చైతన్యను ఎంతగానో బాధ పెడుతోందని తెలుస్తోంది.సినిమాసినిమాకు చైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.