పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలనే ఆలోచనతో జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.అయితే రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలను వేగంగా రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల విషయంలో మాత్రం వేగం చూపించడం లేదు.
పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తైంది.
అయితే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్లు మారగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో పవన్ అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రమే క్రిష్ కు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

వినోదాయ సిత్తం రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా జులైలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.పవన్ హీరోగా తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి కూడా క్లారిటీ లేదు.
పవన్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి.మరి కొందరు డైరెక్టర్ల డైరెక్షన్ లో పవన్ ప్రాజెక్ట్ లను ప్రకటించగా ఆ డైరెక్టర్లు వేరే హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో స్పష్టత వస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.