తెలుగు రాష్ట్రాల్లో టాప్ హీరోల మధ్య ఊహించని స్థాయిలో పోటీ ఉంది.పాన్ ఇండియా మూవీతో సక్సెస్ సాధిస్తే దాదాపుగా అందరు హీరోలకు 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే సత్తా అయితే ఉంది.
అయితే ఒక విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నంబర్ వన్ అని ఫ్యాన్స్ నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్రేజ్ విషయంలో పవన్ కు పోటీనిచ్చే హీరోలు లేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఖుషి తర్వాత కొన్నేళ్ల పాటు సక్సెస్ లేకపోయినా పవన్ కు ఫాలోయింగ్, రేంజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు.రీమేక్ సినిమా అయిన గబ్బర్ సింగ్ తో కూడా పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అత్తారింటికి దారేది సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం లీకైనా పవన్ ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నారని పవన్ క్రేజ్ కు ఇదే నిదర్శనమని ఫ్యాన్స్ చెబుతున్నారు.
పవన్ ఎక్కడికి వెళ్లినా అక్కడికి లక్షల సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపు కోసం పని చేసే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.చాలామంది హీరోలు రీమేక్ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటే పవన్ మాత్రం మెజారిటీ రీమేక్ లతో హిట్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఒక్కో సినిమాకు పవన్ రికార్డ్ రేంజ్ లో తీసుకుంటున్నా పవన్ ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం గమనార్హం.పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ హీరోనే కాదని రియల్ లైఫ్ హీరో కూడా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.