పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.
ప్రెసెంట్ పవన్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేదు.
ఎందుకంటే ఈయన మధ్య మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు.పవన్ రాజకీయాల కోసం కూడా సమయం కేటాయించాల్సి వస్తుండడంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు.
పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.
అలాగే తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదయ సీతమ్’ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.
ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇక్కడ తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా ఆగష్టులో సెట్స్ మీదకు వెళుతుంది అని టాక్ వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్టార్ట్ చేయడం లేదట.షూటింగ్ అప్డేట్ పై దర్శక నిర్మాతలకు ఎలాంటి అప్డేట్ లేదని అంటున్నారు.
ఎందుకంటే పవన్ ప్రెసెంట్ అస్వస్థతకు గురి అయ్యాడు.అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు.దీంతో ఈ రీమేక్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక పోవడంతో సాయి తేజ్, సముద్రఖని ఎటు తేల్చుకోలేక పోతున్నారట.ఈ సినిమా వల్ల సాయి తేజ్ మిగతా సినిమాలు ఆగిపోవడంతో ఆ దర్శక నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నారట.
ఇటీవలే యాక్సిడెంట్ నుండి కోలుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సాయి తేజ్ పవన్ కారణంగా తన సినిమా వాయిదా వేసుకున్నాడట.అలాగే సముద్ర ఖని సైతం తన మిగతా కమిట్ మెంట్ లను హోల్డ్ లో పెట్టి రీమేక్ పనులు చేస్తున్న ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చెప్పలేని పరిస్థితి కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు.
అలాగే పవన్ డేట్స్ కోసం మరో సినిమా ఒప్పుకోని హరీష్ శంకర్, వీరమల్లు సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలియని పరిస్థితిలో క్రిష్.అలాగే నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రి మూవీ మేకర్స్ వారు ఇలా అందరు ఈయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరి పవన్ త్వరలోనే మంచి ప్లాన్ తో వస్తాడో రాడో చూడాలి.