ప్రమాదాలు మనకి చెప్పి రావు.అలాగని మనిషి ప్రయాణించకుండా ఉండలేడు.
అయితే ప్రమాదం జరిగినపుడు మాత్రం మనకి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి.కానీ అదే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునేందుకు మార్గం లేనపుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహకి అందదు.
ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.అమెరికాలోని బోస్టన్ శివార్లలోని మిస్టిక్ నదిపై నిర్మించిన వంతెనపై ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
వంతెన మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో భారీగా మంటలు వచ్చాయి.దాంతో ప్రయాణికులు ప్రాణభయంతో కొట్టిమిట్టాడారు.
వివరాల్లోకి వెళితే, MBTA (మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ) ప్రకారం.వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆరెంజ్ లైన్ రైలు హెడ్ కార్ నుండి మంటలు చెలరేగడంతో పొగలు విపరీతంగా కమ్ముకున్నాయి.
వెంటనే అలర్ట్ అయిన అధికారులు.ప్రయాణికులను అలర్ట్ చేయడం జరిగింది.అయితే వారు తప్పించుకోవడానికి మాత్రం ఎలాంటి మార్గం లభించలేదు.ఎందుకంటే కింద చూస్తే నీరు.
స్టేషన్ కాస్త దూరంలో వుంది.
అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
రైలులో మంటలు వ్యాపించిన సమయంలో.పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురి అయ్యారు.ఆ సమయంలో కొంతమంది చొరవ తీసుకొని ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేసారు.వారికి ధైర్యం చెప్పారు.కొంతమంది కిటికీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.కొందరు అలాగే ట్రైన్ కిటికీ నుంచి కిందకు దూకేశారు.
మొత్తానికి ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఎందుకంటే ఆ నదిలోతు అంత పెద్దగా ఏమీ లేదంటే.
దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపు 200 మంది ప్రయాణికులు ఉంటారని అంచనా.