సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరి కెరియర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సినిమాతో స్టార్ హీరోలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో.
ఒక్క సినిమాతో కెరీర్ కొలాప్స్ అయిన వాళ్ళు కూడా అంత మంది ఉన్నారు.హిట్టు వచ్చినప్పుడు కళ్ళకు అద్దుకునే ప్రేక్షకులే ఫ్లాప్ వచ్చినప్పుడు కనీసం అటువైపు తిరిగి కూడా చూడరు.
ఇదంతా మాటల్లో చెప్పుకోవడం కాదు కొంతమంది దర్శకుల విషయంలో నిజమైంది అని చెప్పాలి ఒక దర్శకుడికి ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఆ దర్శకుడితో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలు కూడా సినిమా తీయాలంటేనే భయపడిపోతుంటారు అనే చెప్పాలి.
ఇక ఇలాంటివారిలో ప్రభాస్ తో రెండు సినిమాలు తీసిన దర్శకులు కూడా ఉన్నారు.
రన్ రాజా రన్ అనే సినిమాను శర్వానంద్ తీసి మంచి హిట్ అందుకున్నాడు సుజిత్.ఈ క్రమంలోనే బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ను ఒక సినిమా కోసం ఒప్పించాడు.
ఈ క్రమంలోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో సాహో చిత్రం తెరకెక్కింది.ఇలా ఊహకందని అంచనాలతో విడుదలైన సాహో సినిమా చివరికి ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది.
హిందీలో మంచి వసూళ్లు వచ్చే హిట్ కొట్టిన తెలుగులో మాత్రం ఈ సినిమా విజయం సాధించలేకపోయింది అని చెప్పాలి.ఇక సాహో ఫలితం సుజిత్ కెరీర్పై బాగా పడింది.
లూసిఫర్ రీమేక్ బాధ్యతలను సుజిత్ కు అప్పగించాడు చిరంజీవి.చివరికి సుధీర్ ని పక్కనపెట్టి మోహన రాజాకు బాధ్యతలు అప్పగించారు.
ఇక ఇప్పుడు సుజిత అవకాశాలు లేకుండా పోయాయి.అచ్చం ఇలాగే రాధాకృష్ణ కుమార్ పరిస్థితి కూడా మారిపోయింది.హిస్టోరికల్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకుల అంచనాలను పెంచేసాడు.భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది.దీంతో రాధా కృష్ణ కుమార్ కి కూడా కష్టకాలం మొదలైంది.
దీంతో రాధా కృష్ణ కుమార్ తో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.మరి ఈ ఇద్దరు దర్శకుల కెరియర్ పుంజుకుంటుందా లేదా చూడాలి.