క్రికెట్‌ అసోసియేషన్‌లో రాజకీయ రణం

క్రీడను క్రీడలాగే చూడాలి.కాని ప్రస్తుతం వాటికి రాజకీయాలను అద్దడం,లేదా స్వార్ధానికి ఉపయోగించడం చేస్తే భవిషత్తులో క్రిడల మనుగడ పట్ల ప్రశ్నార్ధకమే మిగిలుతుంది.

 Shivlal Yadav, Arshad Ayub And Shesh Narayan Slam President Azharuddin For Probl-TeluguStop.com

తాజాగా స్పోర్టస్ లో అందరరూ అభిమానించే ఆట క్రిక్రెట్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? జాతీయ స్థాయిలో క్రికెట్ లో పొడచూపుతున్న రాజకీయాలు, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోనూ తొంగి చూస్తున్నాయంటున్నారు క్రీడాభిమానులు.దీనిపై సీనిర్ క్రికెట్ ఆటగాళ్ల అధ్యయనంలో కూడా ఇదే తేలండంతో ఇపుడు తాజా పరిస్థితులు హాట్ హాట్ గా మారాయి.
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో రాజకీయ లబ్దితో స్వార్ధం ప్రవేశించిందనే వాదనలు ప్రముఖులనుంచి వ్యక్తమవుతుంది.ముఖ్యంగా నైపుణ్యాన్ని పక్కన పెట్టి తనవాళ్లకంటూ రిజర్వూ చేసే పరిస్థితులు ఇపుడు ఇక్కడ నెలకొన్నాయి.

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు అజాహారుద్దీన్ భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆయన ఆద్వర్యంలోనే ఇపుడు అవినీతి రాజ్యమేలుతోందని మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో విమర్శలకు తెరలేపారు.

అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో పాటు ఇతర సభ్యుల పనితీరు అవినీతిమయమైందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.ఈ మేరకు నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో బిసిసిఐ మాజీ మధ్యంతర ప్రెసిడెంట్ శివలాల్‌ యాదవ్‌ తో పాటు అర్షద్ ఆయూబ్, శేష్ నారాయణ్.

, మాజీ ఆఫీస్ బేరర్ల పాల్గొన్నారు.అజాహార్ అధ్యక్షతన నడుతుస్తున్న క్రికెట్ అసోసియేషన్ ఎటు వైపు పోతుందో అర్ధం కావడంలేదంటూ అసనహాన్ని వ్యక్తం చేసారు ఈ సమావేశంలో.

ఇప్పుడు హెచ్‌సీఏలో సమస్యలు పేరుకుపోయాయని, చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు.అజహర్ వ్యవహారశైలితో యువ ఆటగాళ్లు లో నిరాశ నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసారు.

Telugu Azharuddin, Bcci, Bcci Supreme, Shesh Yan, Shivlal Yadav-Sports News క�

అధ్యక్షుడి అనాలోచితమైన నిర్ణయాల వల్ల క్రికెటర్లపై పెను ప్రభావం పడుతోందనేది వారి వాదన.ఇంతకీ అధ్యక్షుడు అజహర్‌ దుర్వినియోగం చేస్తున్న అధికారాలు ఏంటి? వాటిపై చర్చించాల్సి పరిస్థితులు ఎందుకొచ్చాయి, అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల మెదడును తొలిచేస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ.అన్ని విభాగాల నిబంధనలను కూడా పాటించడంలో మార్గనిర్దేశం చేయడం లేదనేది యువ క్రికెటర్ల ఆరోపణ.ప్రోత్సాహించాల్సింది పోయి, తన చెప్పుచేతల్లోనే ఉండాలంటూ బెదిరిస్తున్నట్లు వర్ధమాన క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.చివరకు సెలక్షన్ కమిటీని కూడా శాసిస్తూ తన సొంత కమిటీగా మలచుకోవడంలో అజాహార్ పైచేయి సాధించారనేది ప్రస్తుతం శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, శేష్ నారాయణ్.

, మాజీ ఆఫీస్ బేరర్లు ఆరోపిస్తున్నారు.

అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ.

అన్ని విభాగాల నిబంధనలను కూడా పాటించడంలో మార్గనిర్దేశం చేయడం లేదనేది తీవ్ర ఆరోపణలు.మరో మాటగా చెప్పాలంటే అజాహారుద్దీన్ తన సొంత సామ్రాజ్యంగా హైదరాబాద్ అసోసియేషన్ ను మలచుకున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సీనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెట్ సలహా కమిటీలను అజహరుద్దీన్ రద్దు చేసి, నాకెదురెవరు అన్న చందాన తన సొంత సెలక్షన్‌ కమిటీని నియమించారు.నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్న అజాహర్ త్వరలోనూ బుద్ధి చెబుతామంటూ మాజీ ఆఫీస్ బేరర్ల తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు.

మరోవైపు తాజాగా జరగబోయే నాలుగు లీగ్ జట్లను నిలిపివేయడంతో పాటు ఆయా క్లబ్‌ల నిర్వహణ వెనుక చాలా చరిత్ర ఉంది.అలాంటి వాటిని నిలిపివేసి.

ఆయనపై ఆధారపడిన, ఆయనకే చెందిన క్లబ్బులను మాత్రమే క్రికెట్ ఆడిస్తున్నారు.అటు యువ క్రికెటర్లలోనూ, ఇటు మాజీలలోనూ అసహనం రెట్టింపయింది.

ఆయన మాట వినని క్లబ్‌లను రద్దు చేస్తున్నారని విమర్శలకు తెరలేపారు.ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి లీగ్‌లు, మ్యాచ్‌లు నిర్వహించడం లేదు.

మరోవైపు హైదరాబాద్‌లో భారత టీ20 లీగ్‌తో పాటు, రంజీ, ముస్తాక్ అలీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడంలేదు.క్రికెట్‌ పై విరక్తి కలిగే విధంగా అజాహార్ ప్రవర్తిస్తున్న తీరును చూస్తే క్రిక్రెట్ క్రీడాభిమానుల్లో విరక్తికలుగుతుందని చెప్పాలి.

Telugu Azharuddin, Bcci, Bcci Supreme, Shesh Yan, Shivlal Yadav-Sports News క�

అజాహార్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇక్కడ పోలీస్ కేసులు నమోదయ్యినట్లు చెబుతున్నారు.సెలక్షన్ కమిటీ అంటే డబ్బులకు మాత్రమే నెలవుగా ఉందనే భావన ఇపుడు వస్తున్న వర్ధమాన క్రికెటర్లలో నెకొన్న మాట మాత్రం వాస్తవం.నైపుణ్యమున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా అజాహార్ అనుసరిస్తున్న పోకడలకు ముందు ముందు హైదరాబాద్ నుంచి జాతీయజట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు సూన్యమనే అబిప్రాయాలు పలువురినుంచి వినిపిస్తున్నాయి.త్వరలోనే అజహర్ నేతృత్వంలోని హెచ్‌సీఏ కార్యవర్గ,పదవీ బాధ్యతలు ముగిసి పోనున్నాయి.

దాంతో సెప్టెంబర్‌లో హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించమని బిసీసీఐ సుప్రీంకోర్టును అశ్రయించనున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయుబ్ , ఆయన అజాహార్ పై తన నిరసనను వ్యకం చేసారు.

భవిష్యత్‌లో హైదరాబాద్ క్రికెట్‌కు మంచి రోజులు రావాలని ఆశిస్తున్నట్లు కామెంట్ చేసారు.ఆయనమాటలను బట్టి పరిశీలిస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్రస్టుపట్టిపోయిందనేది క్రీడాభిమానుల ఆరోపణ అజాహార్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాతే పోలీస్ కేసులు

మరోవైపు చెక్క్ లపై సంతకాలు చేసే విషయంలోనూ అజహర్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్‌ను ఉల్లంఘిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్రికెట్ క్రీడాభివృద్ధికి కావలసిని నిధులు ఇంకా విడుదల కాలేదనేది మాజీ ల ఆందోళన.అభివృద్ధఇకోసం ఇచ్చిన 16 కోట్లు రూపాయిలను హెచ్‌సీఏ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గడచిన మూడు సంవత్సరాల అకౌంట్స్ కు సంబంధించిన లావాదేవీలు ఇంకా క్లీయర్ కాలేదు.హైదరాబాద్‌లో అజహర్‌ ఉన్న రోజులు, సెక్రెటరీలతో సమావేశం తదితర అంశాలపై ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక జట్టు ఎంపికలో 20 మందికి కంటే ఎక్కువగా ఉండకూడదు.ప్రస్తుతం హెచ్ సీఏ లో 35 మందిని ఎంపిక చేసారు.

దాంతో నిబంధనలు నీళ్లోదిలేసినట్లు తేటతెల్లమవుతూనే వుంది.ఈ పరిస్థితుల్లో మాజీ ఆఫీస్ బేరర్లు అజాహార్ పై విమర్శలు దండయాత్ర చేసారు.

వచ్చే ఎన్నికల్లో అజహర్‌కు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube