జపాన్ సాహసం! రైలు ద్వారా ప్రయాణించి చంద్రుడిపైకి వెళ్తారట!

అవును.మీరు విన్నది నిజమే.

 Japan Adventure Travel By Train And Go To The Moon , Japan , Train, Secret, Mo-TeluguStop.com

జపాన్ ప్రభుత్వం ప్రజలను బుల్లెట్ రైలులో భూమి నుండి చంద్రునిపైకి తీసుకెళ్లాలని తాజాగా నిర్ణయించుకుంది.అదెలా సాధ్యపడుతుంది అని అనుకుంటున్నారా? సాధ్యపడుతుందని జపాన్ అంటోంది.భూమి నుండి ప్రజలను చంద్రునిపైకి తీసుకెళ్లే బుల్లెట్ రైలును త్వరలో వారు నడపబోతున్నారని వినికిడి.ఈ ప్రణాళికలో విజయం సాధించిన తర్వాత, జపాన్ బుల్లెట్ రైలులో ప్రజలను అంగారక గ్రహంపైకి పంపుతుందట.

ఈ క్రమంలో భూమి నుండి చంద్రునికి బుల్లెట్ రైలును నడపడానికి జపాన్ ప్రణాళిక రచిస్తోంది.

వివరాల్లోకి వెళితే, జపాన్‌కు చెందిన ఈ మెగా ప్రాజెక్ట్‌లో మార్స్‌పై గ్లాస్ ఆవాసాన్ని నిర్మించే ప్రణాళిక కూడా అందులో భాగమట.

అంటే భూమి నుండి బుల్లెట్ రైలు ద్వారా అక్కడికి పంపబడే వారు అక్కడ కృత్రిమ అంతరిక్ష ఆవాసంలో నివసిస్తారని తెలుస్తోంది.కృత్రిమ అంతరిక్ష నివాస కేంద్రం యొక్క వాతావరణం భూమిలాగా తయారవుతుంది.

టెర్రా స్టేషన్ భూమిపై నిర్మించబడుతుంది. స్పేస్ ఎక్స్‌ప్రెస్ క్యాప్సూల్స్ రేడియల్ సెంట్రల్ యాక్సిస్‌పై నడుస్తాయి.

చంద్రుని నుండి అంగారక గ్రహానికి ప్రయాణించడానికి 1G యొక్క గురుత్వాకర్షణ నిర్వహించబడుతుంది.దీని కోసం, భూమిపై ఓ ట్రాక్ స్టేషన్ నిర్మించబడుతుంది.

Telugu Bullet Train, Japan, Japan Adventure, Moon, Secret, Train, Travel, Latest

ట్రైన్ విషయానికొస్తే, 6-కోచ్‌ల స్పేస్ ఎక్స్‌ప్రెస్‌లోని మొదటి మరియు చివరి కోచ్‌లలో రాకెట్ బూస్టర్‌లు అమర్చుతారు.ఇవి మొత్తం రైలును ముందుకు మరియు వెనుకకు జరపడంలో సహాయపడతాయి.ఇది భూమి మరియు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రకారం పనిచేయనుంది.క్యోటో యూనివర్సిటీ, కజిమా కన్‌స్ట్రక్షన్‌లు కలిసి ఈ మెగా ప్రాజెక్ట్ కింద స్పేస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో బుల్లెట్ రైలును నిర్మించబోతున్నాయి.

ఈ రైలు భూమి నుండి చంద్రుడు మరియు అంగారక గ్రహాలకు బయలుదేరుతుంది.ఈ అంతర్ గ్రహ రవాణా వ్యవస్థకు హెక్సాట్రాక్ అని పేరు పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube