టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.వీరు ప్రెసెంట్ సోలో హీరోలుగా చేస్తూ టాప్ లో ఉన్నారు.
ఈ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస షెడ్యూల్స్ తో బిజీగా గడుపు తున్నారు.ప్రెసెంట్ నందమూరి బాలయ్య గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు.
ఇక చిరు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చేస్తున్నాడు.
ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో వరుస అప్డేట్ లను సిద్ధం చేస్తున్నారు మేకర్స్.తాజాగా ఈ సినిమా నుండి మెగాస్టార్ లుక్ ను రివీల్ చేసారు.
ఈ ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ నుండి విశేష స్పందన లభిస్తుంది.ఈ లుక్ లో చిరంజీవి కుర్చీలో స్టైల్ గా కూర్చుని గాగుల్స్ పెట్టుకుని కాస్త వయసు మీద పడిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు.
ఈ ఫస్ట్ లుక్ బాగా అలరిస్తుంది.ఈ లుక్ బయటకు వచ్చిన తర్వాత బాలయ్య ఎన్బీకే107 లుక్ గురించి మాట్లాడు కుంటున్నారు.
ఈ సినిమాలో ఈయన లుక్ కూడా పంచె కట్టుకుని బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఎంతో స్టైలిష్ గా ఉన్నారు.

మరి ఇప్పుడు ఈ ఇద్దరి లుక్ లను పోల్చి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఇద్దరిలో ఎవరిదీ స్టైలిష్ లుక్ అంటూ ఫ్యాన్స్ కు ప్రశ్నలు విసురుతున్నారు.అయితే ఈ రెండు పోస్టర్స్ లో బాలయ్య లుక్ నే బెస్ట్ అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.
మెగా హీరో తర్వాతనే ఎవరైనా అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.ఇలా ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ కావడంతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది.