సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లను దక్కించుకోవడం తో ఈ ఏడాది లో విడుదల అయిన మేటి సినిమా ల్లో ఒక సినిమా గా నిలిచింది అనడంలో సందేహం లేదు.హీరోగా మహేష్ బాబు కు మరో బ్లాక్ బస్టర్ గా సర్కారు వారి పాట నిలిచిందని అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.
ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేశారు.థియేటర్ రన్ లో మంచి వసూళ్లు దక్కించుకున్న సర్కారు వారి పాట సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడం తో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆసక్తి గా చూశారు.
ఓటీటీ లో సినిమా రాక కోసం ఎదురు చూసిన వారు అంతా కూడా ఒక్క సారిగా అమెజాన్ ప్రైమ్ మీద పడిపోయారట.సర్కారు వారి పాట సినిమా ను థియేటర్ ల ద్వారా చూడని వారు చాలా మంది ఉన్నారు.

కారణం మొదటి పది రోజుల పాటు టికెట్ల రేట్ల ను చాలా ఎక్కువ పెంచారు.అందుకే ఈ సినిమా ను అక్కడ విడుదల చేసే సమయంలో ప్రేక్షులకు ఎక్కువగా చూడలేదు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సర్కారు వారి పాట సినిమాను చూడలేక పోయారు అనేది కొందరి మాట.అందుకే సర్కారు వారి పాట సినిమా ను ఓటీటీ ద్వారా ఎక్కువ మంది చూశారు.ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కింది స్థాయి వారు అంతా కూడా ఓటీటీ లో చూసేందుకు ఇష్టపడ్డారు.ఓటీటీ లో సర్కారు వారి పాట సినిమా ను అత్యధికులు స్ట్రీమింగ్ చేశారని అమెజాన్ వారు అనధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది లో అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన టాప్ సినిమా ల జాబితా లో ఈ సినిమా ఉంటుంది.ఈ సినిమా లో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే.