రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు చెబితేనే ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడిపోతున్నారు.గత కొంతకాలంగా టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ తెలంగాణలో విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తోంది.
నియోజకవర్గాల వారీగా ఐ ప్యాక్ టీమ్ రంగంలోకి దిగి పార్టీ పరిస్థితి , సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు నియోజకవర్గాల్లో వారి పనితీరు ఎలా ఉంది ? మరోసారి టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ? ఆయా నియోజకవర్గాల్లో ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరెవరున్నారు ? టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల బలా, బలాలు ఇలా అన్ని అంశాల పైనా సర్వే నిర్వహించి, అధినేత కేసీఆర్ కు నివేదికలు అందిస్తూ ఉండడంతో, కెసిఆర్ ఈ నివేదికలను ఎప్పటికప్పుడు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ బిజెపిని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడడం లేదు.
తెలంగాణలో బిజెపిక అధికారం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహిస్తున్న సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నారు.ప్రస్తుతానికి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు అందుతున్నాయి.ఆ రిపోర్టుల ప్రకారం చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టుగా తేలడం తో రాబోయే ఎన్నికల్లో దాదాపు సగానికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదట.
ఈ టికెట్ల కేటాయింపు అంశంపైనే తరచుగా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సమావేశం అవుతూ ఉండడంతో, టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది.సిట్టింగ్ ఎమ్మెల్యేల కారణంగా అధికారాన్ని దూరం చేసుకునేందుకు ఏమాత్రం కెసిఆర్ ఇష్టపడడం లేదు.
అందుకే అనవసర మొహమాటాలు అన్నిటినీ పక్కనపెట్టి, సర్వేల్లో గెలుస్తారు అనుకున్న వారికి టికెట్లు కేటాయించాలని కేసీఆర్ డిసైడ్ అవ్వడమే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన కలిగిస్తోంది.