టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.ఇక దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ శుక్రవారం ఈ షో ఆహా లో సందడి చేయనుంది.ఇక ఇందులో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా చాలా సన్నిహితంగా కనిపించాడు.
ఆ షోలో ఉన్న జడ్జిల మీద బాగా కౌంటర్లు కూడా వేశాడు.అంతేకాకుండా సింగర్స్ తో కలిసి సరదాగా మాట్లాడుతూ వారి పాటలకు డాన్స్ కూడా చేశాడు.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా రానా, సాయిపల్లవి ప్రమోషన్స్ భాగంలో ఈ షో కి వచ్చారు.

సాయి పల్లవి తన గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది.తనకు డాన్స్ అంటే భయం అని పాటలు పాడటం అంటే కూడా చాలా భయం అని తెలిపింది.ఇక రానా కూడా కొన్ని విషయాలు బయట పెట్టాడు.
రానా, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్షిప్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గురించి రానా ఒక టాపిక్ చెబుతుండగా.
అప్పుడే చిరంజీవి మధ్యలో కలుగజేసుకొని.రామ్ చరణ్ రూమ్ లో ఉండే కిటికీ తలుపుల గ్రిల్ తీసేవాడు అని అన్నాడు.
దాంతో అక్కడున్న వారు అంతా తెగ నవ్వుకోగా.రానా మాత్రం తన బండారం బయట పెట్టినందుకు సిగ్గుపడుతూ కనిపించాడు.
ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో అందరినీ ఆకట్టుకోగా.ఆ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము అన్నట్లు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.