తెలుగు ఎన్ ఆర్ ఐ డైలీ న్యూస్ రౌండప్

1.300 మంది ప్రవాసుల అరెస్ట్

 

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Kuwait,-TeluguStop.com
Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

కువైట్  ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటోంది.కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు.ఇప్పటి వరకు 300 మందికి పైగా  అక్రమంగా నివాసం ఉంటున్న ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

2.డాలాస్ లో జూన్ 25 న TPAD నేతృత్వం లో శ్రీనివాసుడి కళ్యాణం

 

Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

జూన్ 25న అలెన్ ఈవెంట్ సెంటర్ (క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ ) వేదికగా డాలన్ తెలంగాణ సమితి (టి పాడ్ ) భక్తి ప్రపత్తులతో చేపడుతున్న ఈ  విశేష కార్యక్రమానికి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్వయంగా దేవ దేవతల ప్రతిరూపాలను పూజారులు పూజారుల వెంటబెట్టుకు రానున్నారు.
 

3.భారత్ ఎందుకు క్షమాపణ చెప్పాలి

  బిజెపి నుంచి సస్పెన్షన్ కు గురైన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపూర్ శర్మకు నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు , ఫ్రీడమ్ పార్టీ అధ్యక్షుడు గీర్డ్ విల్డర్స్ మద్దతుగా నిలిచారు.అరబ్ దేశాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు.
 

4.చైనా పై ఎలాన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు

 

Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

చైనాలో భారీగా తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు పై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చైనా ప్రతి తరంలో 40 శాతం జనాభా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
 

5.ఒకే ఏడాదిలో 8 లక్షలకు పైగా వర్క్ వీసాలు జారీ

 

Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం 2021లో 8 లక్షలకు పైగా వర్క్ వీసాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 

6.బీజేపీ నేతలకు ఆల్ ఖైదా వార్నింగ్

 మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ బీజేపీ నేతలు నుపుర్ శర్మ , నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆల్ఖైదా సదరు మాజీ బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.వారు ఎక్కడ దాక్కున్న చంపేస్తామంటూ హెచ్చరించింది.
 

7.రష్యా లో అన్ని కార్యకలాపాలు నిలిపివేసిన ఐబీఎం

 

Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం ప్రకటించింది.
 

8.శనివారం సెలవును పునరుద్ధరించిన పాకిస్తాన్

 పాకిస్తాన్ లో ప్రస్తుతం కరెంటు కు తీవ్రమైన కొరత ఏర్పడింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో ఉన్న విధంగానే శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించింది.
 

9.అమెరికాలో మరో సారి కాల్పులు ఆరుగురు మృతి

 

Telugu America, Canada, China, Dalas, Elon Musk, Expatriates, Kuwait, Nri, Nri T

అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి.మెక్సికో విధుల్లో దుండగులు తుపాకులతో వీరంగం సృష్టించారు.ఈ ఘటనలో 6 గురు మృతి చెందారు.
 

10.ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్

  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా వరుసగా రెండోసారి హాంకాంగ్ నిలిచింది.

ఈసీయే ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం న్యూయార్క్ , జెనీవా ర్యాంకింగ్స్ లో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.       

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube