'ముందస్తు ' పై ముందుకే ? కేసీఆర్ నిర్ణయం ఇదే ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సందడి ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే హడావుడి నెలకొంది.

 Cm Kcr Strategies On Going To Early Elections In Telangana Details, Kcr, Telanga-TeluguStop.com

దీనికి తగ్గట్లుగానే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హడావుడి చేస్తుండడం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న తీరు వంటివి వీటికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.తెలంగాణలో టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది .మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే మంచిదనే  అభిప్రాయం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ లో కనిపిస్తోంది.

అందుకే తెలంగాణలో అసెంబ్లీను కెసిఆర్ ముందుగానే రద్దు చేస్తారని,  కేంద్ర అధికార పార్టీ బిజెపి ముందుగానే అంచనా వేస్తోంది.

తెలంగాణలో పరిస్థితులు టిఆర్ఎస్ కు అనుకూలంగా లేకపోవడం,  ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం, ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు సకాలంలో చేయలేకపోవడం,  ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు,  ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత వీటన్నిటిని బిజెపి ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.

పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో …కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లుగా బిజెపి కూడా అంచనా వేస్తోంది.అంతే కాకుండా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నష్టపోవడం ఖాయమనే ఉద్దేశంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీజేపీ బలంగా నమ్ముతోంది.

Telugu Bandi Sanjay, Telangana, Kcr, Trs, Trs Bjp-Political

తెలంగాణలో టిఆర్ఎస్ కు పెరిగిన వ్యతిరేకతను బీజేపీ గుర్తించింది.ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంపై ఇప్పుడు బిజెపి దృష్టిపెట్టింది.ఈ మేరకు పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తోంది.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేస్తోంది.ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రంగా ఉంది.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళి .ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube