ప్రముఖ నటి ప్రగతి ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని వేలా.. ఫ్యాన్స్ షాకయ్యేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప్రగతి ఒకరనే సంగతి తెలిసిందే.హీరోలకు, హీరోయిన్లకు అమ్మ పాత్రలు చేయడం ద్వారా ఈ నటి తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

 Star Actress Pragathi Remuneration Details Here Goes Viral , Actress Pragathi ,-TeluguStop.com

తాజాగా ఎఫ్3 సినిమాతో ప్రగతి ఖాతాలో మరో సక్సెస్ చేరింది.ఈ సినిమాలో ప్రగతి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

ప్రగతికి సోషల్ మీడియాలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రగతి జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ప్రగతి ఒక్కరోజు పారితోషికం 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.సినిమాను బట్టి ఆమె రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

కొన్ని సినిమాలకు మాత్రం రోజువారీ పారితోషికం కాకుండా సినిమాకు ఇంత అని ప్రగతి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.

Telugu Pragati Serials, Tollywood-Movie

ప్రగతి నటిస్తున్న సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రగతి తన తర్వాత సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో ప్రగతి సంచలన వ్యాఖ్యలు చేశారనే సంగతి తెలిసిందే.

Telugu Pragati Serials, Tollywood-Movie

ప్రగతి పలు సీరియళ్లలో నటించి ఆ సీరియళ్ల ద్వారా కూడా ప్రశంసలు అందుకున్నారు.ప్రగతి తన నటనతో ఎన్నో అవార్డులను సైతం గెలుచుకున్నారు.తర్వాత ప్రాజెక్ట్ ల ద్వారా ప్రగతి కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.ప్రగతి చిన్న పాత్రలో నటించినా ఆ పాత్ర ద్వారా మంచి పేరును సొంతం చేసుకుంటున్నారు.

అమ్మ, అక్క, వదిన పాత్రలు చేసే నటీమణుల సంఖ్య తగ్గడంతో ప్రగతికి సినిమాలలో ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube