విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ F3.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు.సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాని ఆడియెన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.ఇక లేటెస్ట్ గా F3 సినిమాను నందమూరి నట సింహం బాలకృష్ణ చూసినట్టు తెలుస్తుంది.
చిత్రయూనిట్ బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారట.సినిమా చూసిన బాలయ్య చిత్రయూనిట్ ని అభినందించారని తెలుస్తుంది.
బాలకృష్ణకి F3 సినిమాకు అసలు సంబంధం లేదు కదా మరి ఆయన ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఈ సినిమా చూశారు అని డౌట్ రావొచ్చు.ప్రస్తుతం బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లోనే బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.అనీల్ డైరక్షన్ టాలెంట్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నా నెక్స్ట్ తనతో సినిమా చేస్తున్నాడన్న కారణంతో బాలకృష్ణ F3 సినిమా చూసినట్టు తెలుస్తుంది.F3 సినిమాని బాలయ్య బాబు ఫుల్ గా ఎంజాయ్ చేశారని చెబుతున్నారు.