స్టార్ హీరో బాలకృష్ణ గొప్పదనం గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.ఇతరులకు కష్టం వస్తే తట్టుకోలేని హీరోగా బాలకృష్ణకు పేరుంది.
ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినా వాటి గురించి వెల్లడించడానికి అస్సలు ఇష్టపడని హీరోగా బాలయ్యకు పేరుంది.ఒక చిన్న మెసేజ్ పెట్టినా బాలయ్య వెంటనే రిప్లై ఇస్తారని ఆయన గురించి అభిమానులు గొప్పగా చెబుతారు.
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పలు సినిమాలలో పృథ్వీరాజ్ బాలయ్యను ఇమిటేట్ చేశారు.
అలా చేయడం గురించి పృథ్వీరాజ్ స్పందిస్తూ తాను ఒక వ్యక్తిని ఇష్టడితే ఆ వ్యక్తి గుణగణాలను తనకు తానుగా ఆపాదించుకుంటానని ఆయన వెల్లడించారు.చిరంజీవి, బాలయ్య ముందు మనమెంత అని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.
ఐదు తరాలు తిన్నా తరగని ఆస్తి బాలయ్యకు ఉందని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.అయితే అంత గొప్ప వ్యక్తి అయినా బాలయ్య సాధారణంగా ఉంటారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
ఆయన సాధారణ ఇన్నోవా కారులో వెళతారని బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం అని పృథ్వీరాజ్ వెల్లడించారు.సినిమా ప్రపంచంలో డౌన్ టు ఎర్త్ ఉండే హీరో ఎవరనే ప్రశ్నకు బాలయ్య పేరు సమాధానంగా వినిపిస్తుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
మేకప్ వేసుకునే సమయంలో తప్ప మిగతా సమయంలో బాలయ్య క్యారవాన్ లో ఉండరని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

రైటర్లు బాలయ్య మార్కు డైలాగ్స్ రాస్తే తాను అలానే చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ప్రేక్షకులు మెచ్చే పాత్రలో బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఆగష్టు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.