ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు.రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.
కృష్ణయ్యల పేర్లను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.ఈ నలుగురిలో విజయసాయిరెడ్డికి జగన్ మరోసారి అవకాశం కల్పించారు.
అటు 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు.మిగిలిన ఇద్దరిలో నిరంజన్‌రెడ్డి, ఆర్.
కృష్ణయ్యలది తెలంగాణ కావడం గమనార్హం.
అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ వర్గాల నుంచే వ్యతిరేకత వస్తోంది.
తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య వల్ల ఏపీలో ఉన్న బీసీలకు ఒరిగేదేంటో అర్ధం కావడం లేదని పలువురు వైసీపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఆర్.కృష్ణయ్య అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని విమర్శిస్తున్నారు.అధికారం కోసం పార్టీ అధినేతలకు భజన చేయడమే ఆర్.కృష్ణయ్య పని అని ఎద్దేవా చేస్తున్నారు.అలాంటి నేత కాబట్టే టీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, టీడీపీలో చేరి పదవులు అనుభవించారని.ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వంతు వచ్చిందని ఆరోపిస్తున్నారు.
అటు బీద మస్తాన్‌రావు పక్కా తెలుగుదేశం పార్టీ అభిమాని అని.ఆయనకు శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున ఫిషరీస్‌కు సరఫరా చేసే ఫుడ్ మెటీరియల్ బిజినెస్‌లు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున చంద్రబాబుకు ఆర్ధిక సాయం చేశారని.ఒకవేళ వైసీపీ ఓడిపోయి ఉంటే ఆయన వైసీపీలోకి వచ్చేవారా అని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీలో ఉన్న బీసీ లీడర్లను పట్టించుకోకుండా బీద మస్తాన్‌రావును జగన్ పరిగణనలోకి తీసుకోవడం తమకు నచ్చలేదని వాపోతున్నారు.

ఇక నిరంజన్‌రెడ్డి విషయానికి వస్తే ఆయన జగన్‌కు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులను వాదిస్తుంటారని.అంతమాత్రాన రాజ్యసభ సీటు కట్టబెట్టడం బాగోలేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.ఆయన వల్ల ఏపీకి కానీ.
పార్టీకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు.రెడ్డి కోటాలో రాజ్యసభ సీటు కోసం స్వపక్షంలోనే చాలా మంది ఆశావహులు ఉన్నారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
అయితే వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచనలతోనే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని.పార్టీలో ఆయన హవా జోరుగా సాగుతోంది కాబట్టే ఆయన పాడిందే పాటగా సాగుతోందని స్పష్టం అవుతోందని చెబుతున్నారు.
.