తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ కాంటెస్టెంట్స్ అయిన సిరి, షణ్ముఖ్ జస్వంత్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ ల పాల్గొన్న విషయం తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు బోలెడంత పాపులారిటీతో ఎంట్రీ ఇచ్చి వీరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు అంతకు రెండింతలు నెగిటివిటీ మూట కట్టుకొని బయటికి వచ్చారు.బిగ్ బాస్ షో వల్ల వీరిద్దరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అని అందరూ అనుకున్నారు.
దీనితో సోషల్ మీడియాలో వీరిపై జరిగిన ట్రోలింగ్స్ తో సిరి కొద్దిరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్ళింది.ఇక షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునైనా అయితే ఏకంగా బ్రేకప్ చెప్పేసింది.
ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాలతో కొద్దికాలంపాటు వార్తల్లో నిలిచారు.కానీ సిరి, షణ్ముఖ్ లు వారికి ఉన్న టాలెంట్ తో నెగటివ్ గా కామెంట్స్ చేసే వారి నోరు మూయించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇదిలా ఉంటే సిరి హనుమంతు ఇటీవల బీఎఫ్ఎఫ్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా షణ్ముఖ్ జస్వంత్ కూడా ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు.అంతేకాకుండా ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.అయితే ఇన్వెస్టిగేషన్ త్వరలో ప్రారంభం అవుతుందని, కేస్ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు అటు సిరి నటిస్తున్న బీఎఫ్‌ఎఫ్ వెబ్ సిరీస్, ఇటు షణ్ముఖ్ నటిస్తున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సీరిస్.
ఈ రెండూ వెబ్ సిరీస్ లు కూడా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్నాయి.మొత్తానికి వారు పంచుకున్న గుడ్‌న్యూస్ విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.